సంక్రాంతి ఫైట్: రాధేశ్యామ్, భీమ్లా నాయక్ ట్రైలర్స్ రిలీజ్ డేట్స్ ఫిక్స్.. గెట్ రెడీ

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్, భీమ్లా నాయక్ సినిమాలు టాప్ లో ఉన్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా RRR కూడా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా సందడి చేయబోతొంది. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు ప్రేక్షకులకు ప్రతి వారం పండగే అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా ట్రైలర్స్ పై కూడా అభిమానుల అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రాధేశ్యామ్, భీమ్లా నాయక్ ట్రైలర్ డేట్స్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

RRR Trailer: Radhe Shyam And Bheemla Nayak Trailer Release Dates | Filmibeat Telugu
అఖండ విజయంతో..

అఖండ విజయంతో..

టాలీవుడ్ సినిమా ప్రపంచంలో రానున్నరోజుల్లో సరికొత్త సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఇప్పటికే అఖండ సినిమా భారీ స్థాయిలో విజయాన్ని అందుకొని సినీ ప్రముఖుల్లో చాలా ఆనందాన్ని నింపింది. ముఖ్యంగా నిర్మాతలు రానున్న రోజుల్లో ధైర్యంగా సినిమాలను రిలీజ్ చేసుకోవచ్చు అని ఒక నమ్మకం అయితే కలిగించింది. ఏదేమైనా కూడా సినిమా ప్రమోషన్స్ బట్టి అలాగే సినిమాకు హైప్ ను బట్టి కూడా కలెక్షన్స్ భారీ స్థాయిలో వస్తున్నాయి.

పుష్ప, RRR ట్రైలర్స్..

పుష్ప, RRR ట్రైలర్స్..

ఏదేమైనా కూడా సినిమా కంటెంట్ జనాలకు ఆకట్టుకుంటే చాలు.. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే కలెక్షన్స్ ఊహించని రేంజ్ లో ఉంటాయి అని చెప్పవచ్చు. ఒక సినిమా ట్రైలర్స్ కూడా అంచనాలు ఒక్కసారిగా పెరిగి పోతున్నాయి. అందుకే వాటిని కూడా సరైన సమయం చూసి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే పుష్ప సినిమా ట్రైలర్ 6వ తేదీన రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక RRR ట్రైలర్ 9వ తేదీన రాబోతోంది.

రాధేశ్యామ్ ట్రైలర్ ఎప్పుడంటే

రాధేశ్యామ్ ట్రైలర్ ఎప్పుడంటే

అసలు మ్యాటర్ లోకి వస్తే భీమ్లా నాయక్ రాధేశ్యామ్ సినిమాల ట్రైలర్స్ కూడా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఇక ఈ ట్రైలర్స్ ఎప్పుడు వస్తాయి అనే విషయం లో చిత్ర యూనిట్ సభ్యులు అయితే ఇంకా అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం రాధేశ్యామ్ ట్రైలర్ డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ డిఫరెంట్ లవ్ స్టోరీకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన కొన్ని పాటలు సినిమా పై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక ట్రైలర్ కూడా అంతకు మించి అనేలా ఉంటుంది అని ఇదివరకే దర్శకుడికి ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.

భీమ్లా నాయక్ డేట్ ఫిక్స్..

భీమ్లా నాయక్ డేట్ ఫిక్స్..

ఇక భీమ్లా నాయక్ సినిమా జనవరి 13న భారీ స్థాయిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. రాధేశ్యామ్ తో పోటీకి వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తోనే భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేయాలని చూస్తోంది. ఇక ట్రైలర్ ను జనవరి 1 లేదా 5వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఆ సమయంలో తప్పకుండా ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేస్తుందని త్రివిక్రమ్ కూడా ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులతో చర్చలు జరిపినట్లు సమాచారం. కుదిరితే జనవరి 5వ తేదీన పక్కాగా ట్రైలర్ ను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X