ప్రభాస్ తలనొప్పి తెచ్చిన ‘రాధే శ్యామ్’: ఆ సినిమా ఆపేయాల్సిందే.. అదే జరిగితే ‘ఆదిపురుష్’కూ కష్టాలే

'ఈశ్వర్' అనే సినిమాతో హీరోగా పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను దక్కించుకున్న అతడు.. చాలా కాలం పాటు పరాజయాలతో సతమతం అయ్యాడు. ఇలాంటి సమయంలోనే 'బాహుబలి'తో యూనివర్శల్ స్టార్ అయ్యాడు. దీని తర్వాత కేవలం భారీ చిత్రాల్లోనే నటిస్తూ పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఏకంగా మూడు చిత్రాలను ప్రకటించిన ప్రభాస్‌కు ఊహించని కష్టం వచ్చింది. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళితే...

 రెండింటితో పెరిగిన క్రేజ్.. మార్కెట్ కూడా

రెండింటితో పెరిగిన క్రేజ్.. మార్కెట్ కూడా

'బాహుబలి'తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన తర్వాతి చిత్రం 'సాహో'ను కూడా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేశాడు. తెలుగుతో సహా దక్షిణాది భాషల్లో నిరాశ పరిచిన ఈ మూవీ.. హిందీలో మాత్రం సత్తా చాటింది. అక్కడ సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసి రికార్డులు క్రియేట్ చేసింది.

రొమాంటిక్ సినిమాతో రాబోతున్నాడుగా

రొమాంటిక్ సినిమాతో రాబోతున్నాడుగా

ప్రస్తుతం ప్రభాస్.. 'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్‌తో 'రాధే శ్యామ్' అనే మూవీ చేస్తున్నాడు. దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రొమాంటిక్ రోల్‌లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రకటించింది వాటిని.. మొదలెట్టింది ఇది

ప్రకటించింది వాటిని.. మొదలెట్టింది ఇది

'రాధే శ్యామ్' పట్టాలపై ఉండగానే ప్రభాస్.. నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ దీన్ని నిర్మిస్తున్నారు. దీనితో పాటు 'ఆదిపురుష్' అనే హిందీ చిత్రాన్ని కూడా ప్రకటించాడు. ఓం రౌత్ రూపొందించనున్నాడు. వీటి తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ ప్రకటించాడు. అన్నింటికంటే ముందే దీన్ని మొదలెట్టాడు.

ఇప్పుడు మాత్రం ఆ సినిమా షూటింగ్

ఇప్పుడు మాత్రం ఆ సినిమా షూటింగ్

ప్రభాస్ ప్రస్తుతం 'ఆదిపురుష్' షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ముంబైలోని మధ ద్వీపంలో జరుగుతోన్న ఈ షెడ్యూల్‌లో హీరోపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దాదాపు నలభై రోజుల పాటు జరగనున్న ఈ షూటింగ్‌లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించబోతున్నారు. ఇక, ఈ మూవీ నుంచి శ్రీరామనవమి కానుకగా ఓ పోస్టర్ కూడా రాబోతుందని తెలుస్తోంది.

ప్రభాస్ తలనొప్పి తెచ్చిన ‘రాధే శ్యామ్'

ప్రభాస్ తలనొప్పి తెచ్చిన ‘రాధే శ్యామ్'

ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'రాధే శ్యామ్' షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఇందులో కొన్ని బ్యాలెన్స్ సీన్స్ చిత్రీకరించాల్సి ఉంది. వాటిని వీలైనప్పుడు షూట్ చేయాలని మొదట భావించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సన్నివేశాలను ఏప్రిల్ మూడో వారం నుంచి చిత్రీకరించబోతున్నారట. ఇందుకోసం కృష్ణం రాజు కూడా చిత్ర యూనిట్‌తో కలుస్తారనే టాక్ వినిపిస్తోంది.

Recommended Video

Akhanda Vs Acharya Vs Narappa, హీరోల లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా !
ఆ సినిమా ఆపేయాల్సిందే... కష్టాలు

ఆ సినిమా ఆపేయాల్సిందే... కష్టాలు

ఇప్పుడు అర్థాంతరంగా 'రాధే శ్యామ్' షూటింగ్ ప్రారంభిస్తే.. గుజరాత్‌లో ప్లాన్ చేసిన 'సలార్' షెడ్యూల్ వాయిదా వేయాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఆ యూనిట్‌కు కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం 'ఆదిపురుష్' షూటింగ్ పైనా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 'రాధే శ్యామ్' మూవీ మిగిలిన రెండు భారీ ప్రాజెక్టులకు ఇబ్బందులు కలిగిస్తోందన్న మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X