రాధేశ్యామ్ దర్శకుడికి మరో లక్కీ ఛాన్స్.. ఆ స్టార్ హీరోతో బిగ్ మూవీ?

సాధారణంగా సినిమా రంగంలో హిట్లు ఫ్లాపులు అనేవి ఎవరి చేతులోనూ ఉండవు. ప్రతి ఒక్కరూ విజయాలు సాధించాలన్న లక్ష్యంతోనే మూవీలు తీస్తుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక మూవీ ఫ్లాప్ అయితే అది దర్శకుడి మీదే నెట్టేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే టాలీవుడ్‌లో ఎంతో మంది డైరెక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. అందులో స్టైలిష్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ఒకడు. రైటర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన అతడు.. ఆ తర్వాత దర్శకుడిగా మారి 'జిల్' అనే సినిమాను చేశాడు. కానీ, ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు.

Radhe Shyam Director Radha Krishna Kumar upcoming planning with vishal

దర్శకుడిగా మొదటి చిత్రమే పరాజయం పాలైనా రాధాకృష్ణ కుమార్‌కు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఛాన్స్ ఇచ్చాడు. ఇలా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 'రాధే శ్యామ్' అనే సినిమా వచ్చింది. ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ చిత్రం.. టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. అలాగే, ఈ డైరెక్టర్‌పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. దీని తర్వాత రాధాకృష్ణ ఇప్పటి వరకూ ఒక్క సినిమాను కూడా ప్రకటించలేదు. అంతలా అతడిపై ప్రభావం పడింది. ఈ పరిస్థితుల్లో తాజాగా అతడు ఓ హీరోను పట్టేసినట్లు తెలిసింది.

ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. రాధాకృష్ణ కుమార్ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో చేయబోతున్నాడట. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతుందని తెలిసింది. గతంలో మాదిరిగానే ఈ సినిమాను కూడా రాధాకృష్ణ సరికొత్త నేపథ్యంతో ప్రయోగాత్మకంగా చేయబోతున్నాడని అంటున్నారు. దీని ద్వారా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మరో కొత్త జోనర్‌ను టచ్ చేయబోతున్నాడట. ఇక, ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

Radhe Shyam Director Radha Krishna Kumar upcoming planning with vishal

విశాల్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించే ఈ చిత్రం తమిళం, తెలుగుతో పాటు హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో రూపొందబోతుందని తెలిసింది. దీంతో ఈ క్రేజీ కాంబోపై అప్పుడే మంచి హైప్ క్రియేట్ అవుతుంది. ఇంకా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే రివీల్ కానుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X