»   » షాక్ ఇస్తోంది : బాలయ్య హీరోయిన్...హోమో సెక్సవల్ ..

షాక్ ఇస్తోంది : బాలయ్య హీరోయిన్...హోమో సెక్సవల్ ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై ‌: బాలకృష్ణ హిట్ చిత్రం ...లెజెండ్‌ ఫేం రాధికా ఆప్టే ఇప్పుడు బాలీవుడ్ లో విభిన్న తరహా చిత్రాలతో దూసుకుపోతోంది. ఆమె ఎవరూ ఊహించని పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఆమె తాజాగా హోమో సెక్సవుల్ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.

హోమోసెక్సవుల్ బేస్ గా నడిచే ఓ బాలీవుడ్ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో అనేక లవ్ మేకింగ్ సీన్స్ ఉండబోతాయని చెప్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరూ, రాధికా ఆప్టే సరసన నటించేదెవరు, నిర్మాణం ఏ సంస్ద అనేది త్వరలో తెలియనుంది.

ఇక రాధికా ఆప్టే మిగతా చిత్రాలు విషయానికి వస్తే...ఆమె నటించిన కామెడీ చిత్రం ట్రైలర్ ఇప్పటికే విడుదలై నవ్వులను పంచుతోంది. వన్స్ ఆప్ ఎ వాటర్ అనే పంచ్ లైన్ తో స్టార్ట్ అయ్యే 'కౌన్‌ కిత్‌నే పానీ మే' చిత్రం ట్రైలర్ పూర్తి వ్యంగ్యంతో సాగింది. మీరూ ఈ ట్రైలర్ చూడండి.

కాస్ట్, పవర్ ఈక్వేషన్స్ కన్నా మంచి నీళ్లు అనేది చాలా ఇంపార్టెంట్ అనే పాయింట్ తో ఈచిత్రం సాగుతుంది. అప్పటివరకూ కులం, డబ్బు అంటూ అధికారంతో విర్రవీగిన వాళ్లు తమ దగ్గర నీళ్లు అనే అతి విలువైన వనరు లేకపోయేసరికి ఎలా మారిపోయేరనే విషయం వ్యంగ్యంతో చెప్తుంది. ఈ కథ రెండు గ్రామాల మధ్య జరుగుతుంది. డబ్బు, అధికారం,కులం అంటూ రెండు గా విడిపోయినవి అవి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో పరిస్ధితి రివర్స్ అయ్యింది. నీళ్లే ...అథికారాన్ని పునర్విచించే స్ధితికి వచ్చాయి. దాంతో ప్రేమలు,, పెళ్లిళ్లు సైతం ఈ నీళ్ల ప్రభావానికి లోనవుతాయి. ఈ సినిమా మన వనరులను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో తెలిపే ఓ వ్యగ్యాత్మక రూపకం.

Radhika Apte is a Homosexual!

బాలీవుడ్‌ నటుడు కునాల్‌ కపూర్‌లు జంటగా నటించిన చిత్రం 'కౌన్‌ కిత్‌నే పానీ మే'. ఈ చిత్ర ట్రైలర్‌ గురువారం విడుదలైంది. నీలా మాధవ్‌ పాండా(ఐ యామ్‌ కలాం ఫేం) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజస్థాన్‌లో నీటి సమస్య ఉన్న ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబం ఎదుర్కొనే కష్టాలపై ఈ చిత్ర కధనం నడుస్తుంది.

ఈ చిత్ర ట్రైలర్‌లోని సంభాషణలు ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సౌరభ్‌ శుక్లా, గుల్షన్‌ గ్రోవర్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా మొత్తం నవ్వులుతో నిండిపోయి, ఆలోచనలో పడేస్తుందని చెప్తున్నారు.

English summary
Radhika Apte is playing the lead in a film based on Homosexuality. The film will have many bold love making scenes. Details of Radhika's partner and rest of the cast will be announced soon.
Please Wait while comments are loading...