Sudigali Sudheer: గాలోడు బాక్సాఫీస్ దెబ్బకు బంపరాఫర్.. నాగార్జున డైరెక్టర్ తో సుధీర్ న్యూ మూవీ!

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్న కమెడియన్ సుడిగాలి సుదీర్ ఆ తరువాత పలు సినిమాలలో కొన్ని సైడ్ క్యారెక్టర్స్ లలో కామెడీ పాత్రలు కూడా చేశాడు. అయితే ఇప్పుడు అతనికి హీరోగా కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఊహించిన విధంగా మాస్ హీరోల తరహాలో కమర్షియల్ సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇక ఇటీవల గాలోడు సినిమా సక్సెస్ కావడంతో అతనికి మంచి అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో నాగార్జునతో సినిమా చేసిన ఒక ప్రముఖ దర్శకుడు కూడా అతనితో ఇటీవల ఒక కథ గురించి చెప్పినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

 గాలోడు సక్సెస్

గాలోడు సక్సెస్


టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది కమెడియన్స్ హీరోలుగా అడుగులు వేసి మంచి గుర్తింపునందుకున్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ సుధీర్ కూడా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇదివరకే అతను కొన్ని సినిమాలు చేశాడు. కానీ అవి ఏమీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ ఇటీవల వచ్చిన గాలోడు సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకోవడంతో అతని రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

 ప్రముఖుల ప్రశంసలు

ప్రముఖుల ప్రశంసలు


మాస్ కమర్షియల్ మూవీ గా వచ్చిన గాలోడు సినిమా సినిమాలో సుధీర్ కనిపించిన విధానం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. యాక్షన్ ఫైట్ ఎపిసోడ్స్ లో కూడా అతను బాగానే మెప్పించాడు. ముఖ్యంగా డ్యాన్స్ లో కూడా ఆకట్టుకోవడంతో కమర్షియల్ హీరోగా అతను సెట్ అవుతాడని ఇండస్ట్రీలో ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా కూడా కొంతమంది కొత్త దర్శకులు అతనికి కథలు కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది.

మార్కెట్ పెరిగింది

మార్కెట్ పెరిగింది

గాలోడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. కేవలం రెండు కోట్ల బిజినెస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నాలుగైదుకోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. సుధీర్ మీద ఇప్పుడు నాలుగు కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి అయినా సరే కొంతమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ సుధీర్ మాత్రం తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.

 ఆ దర్శకుడితో మూవీ

ఆ దర్శకుడితో మూవీ

ఇటీవల సుధీర్ ఒక ప్రముఖ దర్శకుడు తో సినిమా చేసేందుకు చర్చలు జరిపినట్లు సమాచారం. ఆదర్శకుడు మరెవరో కాదు ఒకప్పుడు రచయితగా మంచి గుర్తింపుని అందుకొని ఆ తర్వాత దర్శకుడుగా మారిన వీరు పోట్ల అని తెలుస్తోంది. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా కథలను అందించిన వీరుపోట్ల ఆ తర్వాత బిందాస్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ముఖ్యంగా నాగర్జునతో అతను చేసిన మాస్ కమర్షియల్ మూవీ రగడ మంచి గుర్తింపు ఉంది.

ఇప్పుడు సుధీర్ తో సినిమా..?

ఇప్పుడు సుధీర్ తో సినిమా..?


అయితే వీరు పోట్ల 2013లో దూసుకెళ్తా సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ సునీల్ తో వీడు గోల్డ్ ఎహే అనే సినిమా చేశాడు. కానీ ఆ రెండు సినిమాలు కూడా తీవ్రంగా నిరాశపరిచాయి. మళ్ళీ ఆ తర్వాత అతను ఎక్కువగా ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇక ఇప్పుడు సుధీర్ తో అతను ఒక మాస్ కమర్షియల్ మూవీ చేయాలి అని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X