Thalaivar 171: రజినీ కోసం విలన్ గా మారబోతున్న డ్యాన్స్ మాస్టర్, ఎవరంటే?
సూపర్ స్టార్ రజినీ కాంత్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే జైలర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన సూపర్ డూపర్ హిట్టు కొట్టారు. బాక్సాఫీసు వద్ద భారీ ప్రభంజనం సృష్టించిన రజినీ ఫుల్ జోష్ లో ఉన్నారు. అదే ఊపుతో వరుసగా చిత్రాలను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే తలైవా 170 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. జ్ఞానవేల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ రజినీ తన వర్క్ చేసుకుంటున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకముందే రజినీ కాంత్ తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలైవా 171వ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు రజినీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాలు వచ్చాయి. తాజాగా వీరిద్దరి కాంబోలో మరో చిత్రం వస్తుందనగా.. అది హ్యాట్రిక్ అవుతుందని అంతా భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన ఏ ఒక్క అప్ డేట్ బయటకు వచ్చినా ఫుల్ వైరల్ అవుతోంది. తాజాగ ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింటిని షేక్ చేస్తోంది.

తలైవా 171వ చిత్రంలో రజినీ కాంత్ కోసం ఓ స్టార్ డైరెక్టర్, యాక్టర్, డ్యాన్సర్, రచయితగా.. గుర్తింపు తెచ్చుకున్న ఓ వ్యక్తిని విలన్ గా పెట్టబోతున్నారట. అయితే అతను ఎవరో కాదు ముని సినిమాతో డైరెక్టర్ గా మారిన డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్. రజినీ కాంత్ కు విలన్ గా లారెన్స్ కరెక్టుగా సెట్ అవుతారని.. చిత్రబృందం భావిస్తోందట. ఈక్రమంలోనే ఆయనను కలవగా.. రాఘవ లారెన్స్ ఓకే చెప్పారట. అయితే ఈ వార్త ఇప్పటికే నెట్టింట ఫుల్ వైరల్ గా మారిపనప్పటికీ... అధికారిక ప్రకటన మాత్రం బయటకు రాలేదు.
అయితే త్వరలోనే ఈ సినిమా టీం నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని సినీ విళ్లేషకులు భావిస్తున్నారు. తలైవా 171వ సినిమాను లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తుండగా.... అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం అవుతుండగా.. వచ్చే దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేస్తారట. చూడాలి మరి అధికారిక ప్రకటన వస్తే పూర్తిగా విషయం తెలిసేలా లేదు.

మరోవైపు సూపర్ స్టార్ రజినీ కాంత్ తన కూతురు ఐశ్వర్య డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ చిత్రం పేరు లాల్ సలామ్. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను ఇటీవలే విడుదల చేయగా.. అనూహ్య స్పందన వచ్చింది ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి కూతురి డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











