రవితేజకే లారెన్స్ స్కెచ్ గీసి మరీ...
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో సినిమా అంటే తెలుగు హీరోలు భయపడుతున్న సంగతి తెలిసిందే.ఎలాగోలా కష్టపడి రెబెల్ చిత్రం పట్టుకుని ప్రభాస్ ని డైరక్ట్ చేస్తున్న లారెన్స్ కన్ను మాస్ మహారాజాని అంటూ దూసుకుపోతున్న రవితేజపై పడింది.కాంచన హిట్ తో బెల్లంకొండ సురేష్ కి డబ్బులు తెచ్చిపెట్టిన లారెన్స్ తన తదుపరి చిత్రానికి రవితేజాని తెచ్చిపెట్టే భాధ్యతను బెల్లంకొండపై పెట్టాడు.సరేనన్న బెల్లంకొండ తను గతంలో రవితేజతో శంభో..శివ ..శంభో చిత్రం చేసి నష్టాలు పాలైన సంగతి గుర్తు చేసి మార్కెట్ రేటు కన్నా కాస్త ఎక్కువే ఇస్తానని చెప్పి రవితేజను ఒప్పించాడని ఫిల్మ్ నగర్ టాక్.అందులో భాగంగానే రవితేజ..లారెన్స్ కాంచన షోకు హాజరయ్యి ప్రెస్ మీట్లో సినిమాని ఓ రేంజిలో పొగిడి..పొగిడి వదిలాడు. ఈ చిత్రం టైటిల్ ...'ఫుల్ మీల్స్..100% మాస్'అని ఫిక్స్ చేసి రిజిస్టర్ చేయించారు.ఇక ఈ చిత్రానికి చెందిన అఫీషియల్ న్యూస్ రావల్సి ఉంది.


Click it and Unblock the Notifications











