పాన్ ఇండియా సినిమాపై ఫోకస్ పెట్టిన శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్.. ఆ హీరోతోనే?
విజయ్ దేవరకొండ టాక్సీ వాలా సినిమా తో విభిన్నమైన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రాహుల్ సాంకృత్యాన్ ఇటీవల మరో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందించడంతో రాహుల్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక తదుపరి ప్రాజెక్టును ఈ దర్శకుడు పాన్ ఇండియా రేంజ్ లోనే తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడట. ఇటీవల ఒక స్టార్ హీరోను కలిసినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

మొదట్లోనే సక్సెస్ రావడంతో..
మొదట కెమెరామెన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న తర్వాత రాహుల్ సాంకృత్యాన్ ఆ తరువాత దర్శకుడిగా మారాడు. అతను మొదట విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా అనే సినిమాను తెరపైకి తీసుకువచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. మొదటి సినిమానే భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత అంతకు మించి అనేలా సక్సెస్ అందుకోవాలి అని శ్యామ్ సింగరాయ్ స్క్రిప్ట్ పై చాలా రోజులు వర్క్ చేయాల్సి వచ్చింది.

రెండవ సినిమా కూడా బాక్సాఫీస్ హిట్
మొత్తానికి నాని శ్యామ్ సింగరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా ఈ సినిమాను తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో కూడా భారీగానే విడుదల చేశారు. అయితే సినిమాకు మాత్రం తెలుగులోనే మంచి కలెక్షన్స్ వచ్చాయి పెట్టిన పెట్టుబడి కూడా లాభాలను అందించినట్లు తెలుస్తోంది.

డిమాండ్ అయితే గట్టిగానే పెరిగింది..
ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ కి ఇండస్ట్రీలో డిమాండ్ అయితే గట్టిగానే పెరిగింది. మొదట్లో శ్యామ్ సింగరాయ్ కోసం భారీ స్థాయిలో బడ్జెట్ పెట్టడం రిస్క్ అని అందరూ అనుకున్నారు. కానీ ఆ స్థాయిలో బడ్జెట్ పెడితే రాహుల్ బ్యాలెన్స్ చేయగలడా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ సినిమా ఫైనల్ గా సక్సెస్ అవ్వడం తో అతనికి మంచి గుర్తింపు లభించింది.

పాన్ ఇండియా ప్లాన్..
ఇక ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ పాన్ ఇండియా సినిమా చేయాలనే ఆలోచనలోనే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. టాక్సీవాలా సినిమాలో ఆత్మను శ్యామ్ సింగరాయ్ సినిమాలో పునర్జన్మల ను టచ్ చేసిన ఈ దర్శకుడు మూడవసారి ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తాడు అనేది ప్రస్తుతం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.

రామ్ చరణ్ తో చర్చలు
ఇటీవల రాహుల్ సాంకృత్యాన్ రామ్ చరణ్ తో కూడా చర్చలు జరిపినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. తదుపరి ప్రాజెక్టును పాన్ ఇండియా తరహాలో తెరపైకి తీసుకురావాలని ఒక మంచి పాయింట్ ను రామ్ చరణ్ కు వినిపించాడట. అయితే ఇంకా ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అని తెలుస్తోంది. మరోసారి కలిసి చర్చిద్దామని కూడా చరణ్ వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.

ఆ సినిమాల తరువాత..
ప్రస్తుతం రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా కథల కోసం సెర్చ్ చేస్తున్నాడు. ఇక శంకర్ సినిమా అనంతరం గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా చేయనున్నాడు. ఇక రాహుల్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ లో సినిమాలు చేస్తాడు కాబట్టి కథ నచ్చితే మరో ఆలోచన లేకుండా ఒప్పుకుంటాడు అని చెప్పవచ్చు. ఒకవేళ ఈ కాంబో ఫిక్స్ అయితే ఈ ఏడాది చివరలోనే సెట్స్ పైకి రావచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











