మరోసారి నాని-సాయి పల్లవి.. ఆ టాలెంటెడ్ డైరెక్టర్‌తో మూవీ ఫిక్స్
తన సహజ నటనతో అందర్నీ ఆకట్టుకోగల నటుడు నాని. అందుకే తెలుగు ప్రేక్షకుల చేత న్యాచురల్ స్టార్ అనిపించుకున్నాడు. ఓ వైపు నాని లాంటి నటుడు ఉంటే.. మరోవైపు సాయి పల్లవి లాంటి హీరోయిన్ ఉంటే స్క్రీన్ ఎంత బాగుంటుందో ఇదివరకే చూశాం. ఇద్దరికిద్దరు పోటీ పడి నటిస్తే ఆ సీన్స్‌కు ఫిదా కాని వారెవరూ ఉండరు.
ఇప్పటికే వీరిద్దరు ఎంసీఏ అనే చిత్రంలో జంటగా నటించారు. కేవలం వీరిద్దరి కెమిస్ట్రీ కారణంగానే సినిమా పాసైపోయింది. సాయి పల్లవి స్క్రీన్ ప్రజెన్స్, నాని పర్ఫామెన్స్ ఇలా సినిమాను సక్సెస్ చేశాయి. అయితే మరోసారి వీరిద్దరు జట్టు కట్టబోతోన్నట్టు సమాచారం.

ప్రస్తుతం నాని 'టక్ జగదీష్' సినిమా చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు. ఇది పూర్తి కాగానే 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయబోతున్నాడని టాక్. ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఈ చిత్రంలో నాని సరసన సాయిపల్లవి నటించనుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











