యువ హీరోతో శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ మరో ప్రయోగం.. ఈసారి టైమ్ ట్రావెల్?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దర్శకుల్లో పెంచుకుంటున్న కథలు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రయోగాత్మకమైన కథలను ఎక్కువగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో మంచి క్రేజ్ అందుకుంటున్న దర్శకులలో రాహుల్ సంకృత్యాన్ కూడా టాప్ లిస్టులో ఉన్నాడు అని చెప్పవచ్చు. టాక్సీ వాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలు వేటికవే భిన్నంగా ఉంటాయి. అయితే దర్శకుడు మూడవ సినిమాను టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల హీరోను కూడా ఫిక్స్ చేసినట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది.

Recommended Video

Shyam Singha Roy : Actor Nani On His Script Selection | Filmibeat Telugu
 ప్రపంచం ముందు నిలబెట్టేందుకు

ప్రపంచం ముందు నిలబెట్టేందుకు

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు, దర్శకులు కూడా అంతకుమించి అనేలా సినిమాలను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాను. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసి భిన్నమైన ప్రయోగాత్మకమైన కథలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మన దర్శకులు అయితే వారి ఆలోచనా విధానాన్ని ప్రపంచం ముందు నిలబెట్టేందుకు చూస్తున్నారు. ఇటీవల శ్యామ్ సింగరాయ్ సినిమాతో దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కూడా మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే.

 మొదటి సినిమాతోనే..

మొదటి సినిమాతోనే..

మొదట సినిమాటోగ్రాఫర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రాహుల్ సాంకృత్యాన్ ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా అనే సినిమా చేశాడు. కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. దర్శకుడి పనితనాన్ని చాలామంది నిర్మాతలు కూడా మెచ్చుకున్నారు.

నానితో బిగ్ హిట్

నానితో బిగ్ హిట్

దర్శకుడు రాహుల్ రెండవ సినిమాతో మరింత డిఫరెంట్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని శ్యామ్ సింగరాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూర్వజన్మల నేపథ్యంలో తెరపైకి వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ప్రాఫిట్స్ అయితే అందించింది. నాని మార్కెట్ కు మించి ఈ సినిమాకు ఖర్చు చేసినప్పటికీ కూడా ఏమాత్రం నష్టాలను కలుగ చేయలేదు

మూడవ సినిమా?

మూడవ సినిమా?

ఇక దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ మూడో సినిమాతో ఏ విధంగా ఆకట్టుకుంటాడు అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల సినిమాకు సీక్వెల్ కూడా రాబోతున్నట్టు కొన్ని కథనాలు వెలువడ్డాయి. కానీ ఆ విషయంలో దర్శకుడు ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అలాగే రామ్ చరణ్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి.

టైమ్ ట్రావెల్ నేపధ్యంలోనే..

టైమ్ ట్రావెల్ నేపధ్యంలోనే..

ఇక ప్రస్తుతం రాహుల్ మూడవ సినిమాకు సంబంధించిన మరొక వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇతను టైం ట్రావెల్ నేపథ్యంలోనే ఒక సినిమాను చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొదట హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ని సెలెక్ట్ చేసుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత పూర్వజన్మల నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్ సినిమా చేశాడు. ఇక ఇప్పుడు మాత్రం టైమ్ ట్రావెల్ నేపధ్యంలోనే ఒక డిఫరెంట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా అడుగులు వేస్తున్నాడట.

అక్కినేని హీరోతో..

అక్కినేని హీరోతో..

ఈ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారు అనే విషయంలో కూడా ఒక టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది. యువ హీరో అక్కినేని నాగచైతన్య తో ఈ టైం ట్రావెల్ ప్రాజెక్ట్ చేసే విధంగా రాహుల్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా అతనికి ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X