శ్యామ్ సింగరాయ్ కథ లీక్.. నాని అలా వస్తున్నాడా..?
న్యాచురల్ స్టార్ నాని ఫుల్ జోష్ మీదున్నాడు. వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. నిన్న (ఫిబ్రవరి 24) నాని పుట్టిన రోజున సందర్భంగా మరో కొత్త ప్రాజెక్ట్‌ను కూడా ప్రకటించేశాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఈ ఏడాదంతా సందడి చేయనున్నాడు. అయితే తాజాగా ప్రకటించిన సినిమా కథ ఇదేనంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
నాని ఇప్పటికే డిఫరెంట్ స్టోరీలకు ఓకే చెబుతున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్వకత్వంలో రాబోతోన్న వీ (V) చిత్రంలో విలన్ రోల్ చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఆమ ధ్య రిలీజ్ చేసిన పోస్టర్, తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌లో నాని అదరగొట్టేశాడు. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతోన్న టక్ జగదీష్ చిత్రం కూడా విభిన్న ప్రేమ కథా చిత్రమేనని టాక్.

'శ్యామ్ సింగరాయ్' అంటూ టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని చేయబోతోన్న కథ పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందని సమాచారం. ఈ స్క్రిప్ట్ లో రెండు ప్రేమకథలు వుంటాయని అందులో ఒకటి హైదరాబాద్ బ్యాక్ డ్రాప్, మరొకటి కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందని లీకులు వైరల్ అవుతున్నాయి. మరి వీటిలో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











