ఉయ్యాల జంపాల లవ్ బర్డ్స్.. మరో రొమాంటిక్ సినిమా చూపిస్తారట!

వెండితెరపై హీరో హీరోయిన్ కాంబినేషన్ అంటే ఆడియెన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఒకప్పుడు ఈ కాంబినేషన్ డోస్ ఎక్కువగా ఉండేది. అయితే ప్రస్తుత కాలంలో జనాలకు బోర్ కొట్టే ఛాన్స్ ఉందని చాలా వరకు రెగ్యులర్ కాంబినేషన్స్ లో సినిమాలు రావడం లేదు. అయితే చాలా గ్యాప్ తరువాత కలిసి నటిస్తే మాత్రం వారు చేసే సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఇక ఇప్పుడు ఉయ్యాల జంపాల కపుల్స్ కూడా మరొకసారి అదే తరహలో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయనున్నారట.

బెస్ట్ ఎంట్రీ..

బెస్ట్ ఎంట్రీ..

ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో రాజ్ తరుణ్ యూత్ లో మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. అలాగే ఆ సినిమా ద్వారా కథానాయికగా సినీ తెరకు ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చోటా స్టార్స్ ఆ తరువాత ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ అందుకున్నారు.

మరో హిట్టు..

మరో హిట్టు..

ఉయ్యాల జంపాల సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న రాజ్ తరుణ్ , అవికా గోర్ కెమిస్ట్రీ బావుందని పాజిటివ్ కామెంట్స్ అందుకున్నారు. ఇక వారితోనే దర్శకుడు త్రినాథరావు తెరకెక్కించిన 'సినిమా చూపిస్తమావ' కూడా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాతోనే మరోసారి అవికా, రాజ్ తరుణ్ జనాల్లో మరీంత క్రేజ్ అందుకున్నారు. ఇక ఇప్పుడు మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

హ్యాట్రిక్ పై కన్నేసిన జోడి..

హ్యాట్రిక్ పై కన్నేసిన జోడి..

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తమావ సినిమాతో బ్యాక్ టూ బ్యాక్ బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న ఈ జంట హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో ఉయ్యాల జంపాల లవ్ బర్డ్స్ మునుపెన్నడు కనిపించని విధంగా దర్శనమివ్వబోతున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ అనంతరం కొత్త సినిమాపై స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

Recommended Video

Comedian Ali Fires On Film Critics | Raju Gari Gadi Succsess Meet
 మళ్ళీ ఆ దర్శకుడితోనే..

మళ్ళీ ఆ దర్శకుడితోనే..

రాజ్ తరుణ్ కెరీర్ మొదట్లో ఎలాంటి విజయాలు అందుకున్నాడో అందరికి తెలిసిందే. 2016లో రాజ్ తరుణ్ నటించిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు కూడా పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన శ్రీనివాస్ గోవిరెడ్డి దర్శకత్వంలోనే రాజ్ తరుణ్, అవికా గోర్ తో మూడవసారి రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం. మరి ఈ యంగ్ స్టార్స్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X