చిరంజీవి మూవీలో నటిస్తున్న యంగ్ హీరోలు వీళ్లే.. ఏంటి ఆ పాత్రలు చేస్తున్నారా?
ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో కుర్రాళ్ల కంటే సీనియర్లే వేగంగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. అందులో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఒకరు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ స్పీడ్‌గా ప్రాజెక్టులు ఫినీష్ చేస్తోన్న ఆయన.. ఏడాదికి రెండు మూవీలతో వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు చిరంజీవి 'విశ్వంభర' అనే క్రేజీ సినిమాలో నటిస్తున్నారు.
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట రూపకల్పనలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రమే 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోన్న ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అంతేకాదు, చిరంజీవి కెరీర్‌లోనే గతంలో ఎన్నడూ కేటాయించనంత బడ్జెట్‌ను పెడుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబోలో తెరకెక్కుతోన్న 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం అయింది. ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. ఆ తర్వాత కూడా కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ఫేమస్ స్టూడియోలో చిరంజీవి, త్రిషతో పాటు ప్రధాన తారాగణంపై చిత్రీకరణ జరిపించారు.
పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమానుపలు భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం చాలా భాషలకు చెందిన నటీనటులను ఈ మూవీ కోసం తీసుకుంటున్నారు. అయితే, ఇందులో ముఖ్యమైన పాత్రల కోసం టాలీవుడ్ యంగ్ హీరోలను సెలెక్ట్ చేసుకున్నారు. తాజాగా ఆ కుర్రాళ్ల గురించి కీలకమైన సమాచారం లీకైంది.

విభిన్నమైన కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'విశ్వంభర' మూవీలో రాజ్ తరుణ్, నవీన్ చంద్రలు కూడా నటిస్తున్నట్లు తెలిసింది. ఇందులో చిరంజీవికి ముగ్గురు చెల్లెల్లు ఉంటారు. వాళ్లలో ఇద్దరికి జోడీగా ఈ యంగ్ హీరోలు నటిస్తున్నారు. అంటే.. వీళ్లిద్దరూ మెగాస్టార్‌కు బావలుగా కనిపించబోతున్నారు. వీళ్ల మధ్య వచ్చే డ్రామా సీన్స్ ఎమోషనల్‌గా ఉంటాయని తెలిసింది.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కలిసి చేస్తున్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా.. సురభి, ఈషా చావ్లా కీలక పాత్రలను చేస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.


Click it and Unblock the Notifications











