రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా'.. ఓటీటీ డీల్ సెట్టయినట్లే!
టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా ఓటీటీ బాట పడుతున్నారు యువ హీరోలు. మొన్నటి వరకు డిజిటల్ వరల్డ్ లో ఏ మాత్రం రిలీజ్ చేయలేము అని బల్ల గుద్ది చెప్పినవారు కూడా చివరికి ఓటీటీ డీల్స్ బెస్ట్ అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే నాని V సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యేందుకు సిద్దమైన విషయం తెలిసిందే.
ఇక నెక్స్ట్ నిశ్శబ్దం, మిస్ ఇండియా సినిమాలు కూడా త్వరలోనే డేట్స్ ఫిక్స్ చేసుకొని ఓటీటీలోకి రానున్నాయి. అనంతరం సోలో బ్రతుకే సో బెటర్, ఉప్పెన సినిమాలు కూడా అదే దారిలో ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ రెడ్ సినిమా ఇప్పట్లో క్లారిటీ ఇచ్చేలా కనిపించడం లేదు గాని చివరికి ఆ సినిమా కూడా ఏదో ఒక విధంగా ఓటీటీ బాట పట్టాల్సిందే అనే కామెంట్స్ వస్తున్నాయి.

ఇక యువ హీరో రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా కూడా ఫైనల్ గా ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకున్నట్లు టాక్ వస్తోంది. మూడున్నర కోట్లకు సినిమా డిజిటల్ రైట్స్ ని అమ్మేసినట్లు తెలుస్తోంది. ఇక శాటిలైట్ రైట్స్ ద్వారా మరో కోటిన్నర వచ్చినట్లు సమాచారం. ఈ విధంగా రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా సినిమా 5కోట్లతో సరిపెట్టుకున్నట్లు టాక్.
అయితే ఎలాగైనా ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేసి హిట్టు కొట్టాలని రాజ్ తరుణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ వర్కౌట్ కాలేదు. చివరకు నిర్మాతలకు విషయం అర్థమయ్యి ఇంకా ఆలస్యం చేస్తే రేటు తగ్గే ఛాన్స్ ఉందని డీల్ క్లోజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











