‘చిరు’ మాటలు నిజం అయినందుకు చాలా హ్యాపీ...
'ఇద్దరు మిత్రులు" చిత్రానికి సంబంధించిన షూటింగ్ సెట్ లో రాజా రవీంద్రను ఉద్దేశించి చిరంజీవి ఓ మాట అన్నాడట. ఆ మాట నిజమైన సందర్భంగా రాజా రవీంద్ర ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇంతకీ చిరు చెప్పిందేంటో తెలుసా? రాజా రవీంద్రకు మంచి కలుపుగోలుతనం ఉందని, పబ్లిక్ రిలేషన్ షిప్స్ ను బాగా మెయింటెన్ చేస్తాడని, కాబట్టి రవీంద్రకు నిర్మాత అయ్యే లక్షణాలు ఉన్నాయని అన్నాడట.
అప్పుడు రాజా రవీంద్ర ఇవన్నీ ఉంటే ప్రయోజనం ఏముంది, డబ్బులు కావాలి కదా అన్నాడట. దానికి చిరంజీవి అందరి మనసులను గెల్చే మనస్తత్వం నీకుంది. అది చాలు, డబ్బులే అక్కర్లేదు అన్నాడట. ఇది ఈ రోజు నిజమయ్యిందనీ, అనుకోకుండా 'మిరపకాయ్" సినిమాకి ఎగ్జిక్యూటివ్ నిర్మాత అవ్వగలిగానని రాజా రవీంద్ర చెప్పాడు.
రాజా రవీంద్ర చిరంజీవి మిరపకాయ్ రవితేజ రిచా గంగోపాద్యాయ హరీష్ శంకర్ raja ravindra chiranjeevi mirapakaya ravi teja richa gangopadhyay harish shankar


Click it and Unblock the Notifications