ఎన్టీఆర్ సినిమాకు ఊహించని టైటిల్: ‘అ’ సెంటిమెంట్‌ను పక్కన పెట్టిన త్రివిక్రమ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. బడా ఫ్యామిలీకి చెందిన వాడే అయినా స్వశక్తితో హీరోగా పరిచయం అయిన అతడు.. అనతి కాలంలోనే ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక, ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో.. త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు ఎవరూ ఊహించని ఓ టైటిల్ ఫిక్స్ చేశారని తాజాగా న్యూస్ బయటకు వచ్చింది. ఎన్టీఆర్ కోసం 'అ' సెంటిమెంట్‌ను పక్కన పెట్టేశాడట దర్శకుడు. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

ఐదు హిట్లు.. ఎన్టీఆర్ అరుదైన ఘనత

ఐదు హిట్లు.. ఎన్టీఆర్ అరుదైన ఘనత

ఆ మధ్య వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే, పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్' నుంచి మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడతను. ఆ తర్వాత వరుసగా ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఐదు హిట్లు కొట్టిన హీరోగా ఘనతను అందుకున్నాడు.

రామ్ చరణ్‌తో కలిసి పోరాటానికి సిద్ధం

రామ్ చరణ్‌తో కలిసి పోరాటానికి సిద్ధం

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన హీరోల పరిచయ వీడియోలు ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేశాయి.

త్రివిక్రమ్‌తో మరోసారి జోడీ కట్టిన తారక్

త్రివిక్రమ్‌తో మరోసారి జోడీ కట్టిన తారక్

RRR తర్వాత చేయబోయే సినిమాల విషయంలోనూ జూనియర్ ఎన్టీఆర్ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘అరవింద సమేత' వంటి భారీ హిట్ తర్వాత మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిశాడతడు. చినబాబు, నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడిన విషయం తెలిసిందే.

మరోసారి అదే తరహా టైటిల్‌తో త్రివిక్రమ్

మరోసారి అదే తరహా టైటిల్‌తో త్రివిక్రమ్

ఎంతో ప్రతిష్టాత్మకగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పెడుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇందులో ఎన్టీఆర్‌ను రాజకీయ నేపథ్యం ఉన్న కుర్రాడిగా చూపించబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. అలాగే, అతడు మరో పాత్రలో వ్యాపారవేత్తగానూ కనిపిస్తాడనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

ఎన్టీఆర్ సినిమాకు ఊహించని టైటిల్

ఎన్టీఆర్ సినిమాకు ఊహించని టైటిల్

రాజకీయ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో ఫారెన్ నుంచి ఇండియాకు వచ్చిన హీరో.. రాజకీయాల ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటాడని, అందుకే ఈ చిత్రానికి ఢిల్లీ పాలిటిక్స్‌తో ముడిపడేలా ‘అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పెడుతున్నట్లు చెబుతున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు ఎవరూ ఊహించని పేరు ఫిక్స్ చేశారట.

Recommended Video

Ram Pothineni Don't Want 'A Aa' Kind Of Movie From Trivikram
సెంటిమెంట్‌ను పక్కన పెట్టేసిన డైరెక్టర్

సెంటిమెంట్‌ను పక్కన పెట్టేసిన డైరెక్టర్

తాజా సమాచారం ప్రకారం... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో రాబోయే ఈ సినిమా కోసం తాజాగా ఫిలిం చాంబర్‌లో ‘రాజా వచ్చినాడు' అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారట నిర్మాతలు. ఇదైతేనే కథకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అంటే ఈ మూవీ కోసం తన ‘అ' సెంటిమెంట్‌ను పక్కన పెడుతున్నాడట దర్శకుడు త్రివిక్రమ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X