For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ స్టార్ హీరోతో మొదటిసారి రాజమౌళి బిగ్ బడ్జెట్ మూవీ.. ఆలస్యానికి కారణమిదే!

  |

  సౌత్ సినిమా ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా నెవర్ బిఫోర్ అనేలా బిగ్గెస్ట్ కాంబినేషన్స్ తెరపైకి వస్తున్నాయి ఒకప్పుడు స్టార్ దర్శకులు కేవలం ఓ వర్గం హీరోలతో మాత్రమే ఎక్కువగా సినిమాలు చేసేవారు. కానీ ప్రస్తుతం వారి ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. స్టార్ హోదా ను ఉపయోగించుకుంటూ విభిన్నమైన సినిమాలను తెరపైకి తీసుకువస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి కూడా ఇకనుంచి విభిన్నమైన స్టార్ హీరోల ను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. జక్కన్న చాలా వరకు ఒకసారి వర్క్ చేసిన హీరోల తో మరోసారి సినిమా చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపే వారు. ఇక RRR సినిమా తర్వాత ఆ ఫార్మాట్ కు స్వస్తి చెప్పి ఇతర అగ్రహీరోలు సైతం లైన్లో పెట్టనున్నాడు.

  రాజమౌళిపై ఉన్న నమ్మకంతో

  రాజమౌళిపై ఉన్న నమ్మకంతో


  ప్రభాస్ తో మూడు సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ తో మూడు సినిమాలు రామ్ చరణ్ తో రెండు సినిమాలతో హీరోలకు మరింత దగ్గరైన రాజమౌళిపై ఒక కామెంట్ కూడా ఉండేది. ఆయన చేసిన వాళ్ళతోనే వర్క్ చేస్తారని మీడియాలో అనేక రకాల కథనాలు వచ్చేవి. ఇక జక్కన్న ఆ కామెంట్స్ కు త్వరలోనే స్వస్తి చెప్పనున్నారు. ప్రస్తుతం RRR సినిమా పనులు చివరి డదకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా మెగా నందమూరి హీరోల మల్టీస్టారర్ సినిమా చేయడం అంటే అంత సాధారణ విషయం కాదు. మొత్తానికి హీరో రేంజ్ కు తగ్గట్లే సరైన సరైన కథలు సెట్ చేసి సెట్స్ పైకి తీసుకు వచ్చాడు. డైరెక్టర్ రాజమౌళి రాజమౌళి పై ఉన్న నమ్మకంతో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మేకింగ్ మిషన్ లో ఎలాంటి డౌట్ లేకుండా ముందుగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

  రాజమౌళితో వర్క్ చేయాలని..

  రాజమౌళితో వర్క్ చేయాలని..

  RRR సినిమా తర్వాత రాజమౌళి భవిష్యత్తు ప్రాజెక్టులపై అంతకుమించి అనేలా అంచనాలు పెరగడం ఖాయం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు ఆయనతో కూడా ఒక సినిమా చేసే ఛాన్స్ వస్తే చాలు అని అనుకుంటున్నారు. జక్కన్న సినిమాలో సెలెక్ట్ అయితే ఎంత కష్టపడడానికి అయినా సరే సిద్ధంగా ఉన్నారు. కేవలం తెలుగు హీరోలు మాత్రమే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ అగ్ర హీరోలు కూడా ఈ స్టార్ దర్శకుడు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

  ఆయన తలచుకుంటే..

  ఆయన తలచుకుంటే..


  అయితే రాజమౌళి మనసు మాత్రం ఎక్కువగా తెలుగు హీరోల పైనే ఉంది. ఆయన తలచుకుంటే బాలీవుడ్ లో అగ్ర హీరోలు కూడా ఈజీగా డేట్స్ ఇవ్వగలరు కానీ దర్శక ధీరుడు మాత్రం తెలుగు హీరోలు జాతీయస్థాయిలో మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని ఒక వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక RRR సినిమా అనంతరం దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే ఇప్పటికే సినిమా మెయిన్ స్టోరీ సెట్ అయింది పూర్తి కథనం సిద్ధమైతే గాని ఇకపై ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా ఇవ్వకూడదని రాజమౌళి ముందుగానే ఫిక్స్ అయ్యాడు.

  మహేష్ బాబు సినిమా

  మహేష్ బాబు సినిమా

  రచయిత కె.విజయేంద్రప్రసాద్ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు సినిమా పై ఒక క్లారిటీ ఇచ్చాడు. పూర్తిగా స్క్రిప్ట్ అయితే సిద్ధం కాలేదని దర్శకుడు రాజమౌళి కూడా ఈ కథనంపై చర్చలు జరపాల్సి ఉందని అది మొత్తం సెట్ అయితే గాని ప్రాజెక్టు స్టార్ట్ అవ్వదని కూడా అన్నారు. దీంతో సినిమా మొదలవడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది.

  అల్లు అర్జున్ తో మూవీ

  అల్లు అర్జున్ తో మూవీ


  ఇక మహేష్ బాబు సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి ప్రభాస్ తో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు ఆ మధ్య అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇక లిస్ట్ లో అల్లు అర్జున్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ బిజీగా ఉన్నాడు కాబట్టే మరో రెండేళ్ల వరకు అతనితో సినిమా చేసే అవకాశం అయితే లేదు. ఇక అల్లు అర్జున్ తో సినిమా చేయాలని రాజమౌళి ఏప్పటినుంచో అయితే అనుకుంటున్నాడు. బన్నీ టాలెంట్ కు రాజమౌళి చాలా సార్లు ఫ్యాన్ అయిపోయాడు.

  అతడి డాన్స్ స్కిల్స్ అలాగే నటించే విధానం కూడా రాజమౌళికి చాలా ఇష్టం.

  Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu
  ఆలస్యం ఎందుకంటే..?

  ఆలస్యం ఎందుకంటే..?

  చాలాసార్లు తన తండ్రి రచయిత అయినటువంటి కె.విజయేంద్రప్రసాద్ కు కథ సెట్ చేయమని చెప్పాడట. అయితే ఇంతవరకు అంచనాలకు తగ్గట్టుగా సరైన కథ అయితే సెట్ అవ్వలేదట అని తెలుస్తోంది. ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాగే మరో వైపు అల్లు అర్జున్ పుష్ప సినిమా సక్సెస్ కొట్టేలా ఉన్నట్లు అర్థమవుతోంది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తే హీరో స్థాయి అంతకు మించి అనేలా పెరగడం ఖాయం. మరి అల్లు అర్జున్ అడుగులు ఏ విధంగా ఉంటాయో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. అల్లు అర్జున్ పుష్ప అనంతరం వేణు శ్రీరామ్, కొరటాల శివలతో డిఫరెంట్ సినిమాలు చేయనున్న విషయం తెలిసిందే.

  English summary
  Rajamouli and allu arjun biggest combination delay behind the reasons,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X