Rajamouli - Jr NTR: మళ్లీ రాజమౌళితో ఎన్టీఆర్! మూవీ లెజెండ్ బయోపిక్‌తో రీఎంట్రీ..
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్ పై అభిమానుల్లో ఎంత హైప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. "స్టూడెంట్ నెం.1", "సింహాద్రి", "యమదొంగా", "ఆర్ఆర్ఆర్" లాంటి బ్లాక్‌బస్టర్‌లతో వీరిద్దరూ ఇప్పటికే చరిత్ర సృష్టించారు. తాజాగా ఈ సక్సెస్ జంట మరోసారి చేతులు కలపబోతోందని తెలుస్తోంది. ఈసారి అయితే యాక్షన్ లేదా ఫాంటసీ కాదు. ఈ సారి లెజెండరీ బయోపిక్ తో ముందుకు రాబోతున్నారంట. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఏంటీ? ఆ కథేంటీ? మీరు కూడా ఓ లూక్కేయండి.
దాదాసాహెబ్ ఫాల్కే భారతీయ సినిమా చరిత్రలో మొదటి చిత్రమైన "రాజా హరిశ్చంద్ర" (1913) ను తెరకెక్కించి, దేశంలో సినిమా పునాదులను వేసిన మహానుభావుడు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రారంభించింది, ఇది భారత సినీ ప్రపంచంలో అత్యున్నత పురస్కారం. అలాంటి మహానీయుడి కథను బయోపిక్ గా తీయాలని రాజమౌళి, ఎన్టీఆర్ కాంబో భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, రాజమౌళి, ఎన్టీఆర్ ల సరైన డేట్స్ దొరకకపోవడంతో ఈ సినిమాను పట్టాలెక్కించలేకపోయారని టాక్.

ఇదిలా ఉంటే, గతంలో ఆమిర్ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి కూడా ఇదే దాదాసాహెబ్ బయోపిక్ చేయాలని భావించారు. కానీ స్క్రిప్ట్ వారి క్రియేటివ్ విజన్‌కు సరిపోకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. దీంతో ఇప్పుడు రాజమౌళి - ఎన్టీఆర్ కాంబినేషన్ ఈ ఆలోచనను మళ్లీ సజీవం చేస్తుందనే అంచనాలు పెరిగాయి. వ్యక్తి జీవితాన్ని తెరపై చూపించడమే ఒక సవాల్, దానిని రాజమౌళి టేకింగ్, ఎన్టీఆర్ నటన న్యాయం చేయగలడని అభిమానుల విశ్వాసం.
తాజా సమాచారం ప్రకారం, రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి భారతీయ చలనచిత్ర పరిశ్రమ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే (Dhundiraj Govind Phalke) జీవితకథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట. ఈ ప్రాజెక్ట్‌కు "మేడ్ ఇన్ ఇండియా (Made in India)" అనే టైటిల్‌ను ఇప్పటికే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ టైటిల్‌ను రాజమౌళి సుమారు రెండేళ్ల క్రితం ప్రకటించినా.. డేట్ దొరక్కపోవడంతో ఈ సినిమా పట్టలెక్కలేదు. రాజమౌళి తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మించనున్నరట.
అయితే. ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబుతో భారీ గ్లోబల్ అడ్వెంచర్ మూవీపై బిజీగా ఉన్నప్పటికీ, ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఈ బయోపిక్‌పై ఆయన ఫోకస్ చేయబోతున్నారని ఫిలిం నగర్ టాక్. "RRR" తరువాత రాజమౌళి - ఎన్టీఆర్ మళ్లీ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ తో రీ-యూనియన్ కాబోతున్నారంటే.. ఫ్యాన్స్ లో కొత్త జోష్ వచ్చింది. ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్, రాజమౌళికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు "RRR తర్వాత లెజెండ్ బయోపిక్‌తో రీఎంట్రీ అంటే థియేటర్లు మళ్లీ హౌస్‌ఫుల్" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఒక వేళ.. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబో మరోసారి కలిస్తే.. ఈ బయోపిక్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. భారతీయ సినిమా పితామహుడి జీవితం తెరపై రావడం మాత్రమే కాదు, రాజమౌళి దృష్టికోణంలో ఆ మహానీయుడి జీవిత ప్రయాణం చూపించడం అంటే అది ఒక సినిమా చరిత్ర పునర్నిర్మాణం అవుతుందని చెప్పాలి. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ నిజంగా ఆరంభమైతే.. అది ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా గౌరవం మరోస్థాయికి తీసుకెళ్లడం ఖాయమని సినీ అభిమానులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











