SSMB29: మహేశ్ మూవీపై రాజమౌళి కీలక నిర్ణయం.. ఫ్యాన్స్‌కు ఆరోజు మరో పండుగ
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లలో సినిమాలు రావాలని ఆయా స్టార్ల అభిమానులతో పాటు ప్రేక్షకులంతా కోరుకుంటూ ఉంటారు. అలాంటి కలయికల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు - దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి జోడీ ఒకటి. తమ తమ విభాగాల్లో బడా స్టార్లుగా వెలుగొందుతోన్న వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయాలని చాలా కాలంగా ఎంతో మంది కోరుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లోనే మహేశ్, రాజమౌళి కలిసి సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్టుపై ఆరంభంలోనే తారాస్థాయిలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించే క్రేజీ సినిమాపై అందరూ దృష్టి సారించారు. దీనిపై ఇప్పటికే నెలకొన్న బజ్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ మూవీ స్టోరీని తయారు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ ప్రాజెక్టు స్క్రిప్ట్ బాధ్యతను జక్కన్న ఇప్పటికే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించినట్లు స్వయంగా వెల్లడించాడు. ఆయన కూడా ఈ సినిమా ఫలానా జోనర్‌లో రాబోతుందని హిట్ ఇచ్చేశారు. అప్పటి నుంచి దీనిపై చాలా రకాల ప్రచారాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్టుపై క్రేజీ న్యూస్ వచ్చింది.

మహేశ్ బాబు.. ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు సంబంధించిన అటు హీరో, ఇటు దర్శకుడు ఇద్దరూ ప్రకటించారు. కానీ, చిత్ర యూనిట్ నుంచి మాత్రం అధికారిక కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు. దీంతో అసలు ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్టు 9న రాబోతుందట. అంతేకాదు, ఓ కాన్సెప్టు పోస్టర్‌ను కూడా ఆరోజు విడుదల చేస్తారని తెలిసింది. అంటే.. ఆరోజు సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు మరో పండుగ కూడా యాడ్ కాబోతుందన్న మాట.

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించే ఈ ప్రాజెక్టును కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











