RRR రిలీజ్ పై మరో కొత్త టెన్షన్.. వాళ్లపై సీరియస్ అయిన జక్కన్న
ఇండియన్ బిగెస్ట్ మల్టీస్టారర్ RRR కోసం ఓ వైపు మెగా అభిమానులు మరోవైపు నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో కేవలం తెలుగులోనే కాకుండా నార్త్ ఏరియాలో కూడా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. అయితే సినిమా రిలీజ్ డేట్ పై మరొక రూమర్ వైరల్ గా మారింది. దర్శకుడు రాజమౌళి కూడా కొంత సీరియస్ అయినట్లు టాక్ వస్తోంది.

అత్యంత భారీ ప్రయోగాన్ని
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఎవరు చేయని అత్యంత భారీ ప్రయోగాన్ని రాజమౌళి వెండితెరపైకి తీసుకురాబోతున్నాడు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే అక్షయ్ కుమార్ కూడా ఒక హై వోల్టేజ్ పాత్రలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నట్లు ఇటీవల ఫస్ట్ లుక్ తో క్లారిటీ ఇచ్చేశారు.

రాజమౌళి అనుకున్నట్లు రాలేదట.
ఇక సినిమాకు సంబంధించిన మరొక గాసిప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిత్ర యూనిట్ సభ్యుల్లో కూడా కొంత ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే సినిమాలోని అతి ముఖ్యమైన సీన్స్ లలో VFX వర్క్ రాజమౌళి అనుకున్నట్లు రాలేదట.

ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ లలో
విజువల్ ఎఫెక్ట్స్ కోసమే భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నప్పటికీ గ్రాఫిక్స్ టీమ్ మెరుగైన వర్క్ చేయలేదని జక్కన్న అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ లలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా కీలకమట. కానీ అంచనాలకు తగ్గట్లుగా వర్క్ చేయలేదని పనులన్నీ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయమని ఆర్డర్ వేసినట్లు టాక్.

రిలీజ్ డేట్ పై ప్రభావం..
విజువల్ ఎఫెక్ట్స్ పూర్తయితే మళ్ళీ ఎడిటింగ్ తో పాటు డబ్బింగ్ పనులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు సమయం చాలానే పడుతుంది. సినిమా రిలీజ్ డేట్ అక్టోబర్ 13 అని ముందే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మళ్ళీ మొదటి నుంచి చేస్తున్న కారణంగా సినిమా విడుదలపై ప్రభావం పడే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











