RRRలో మూడో హీరోయిన్.. క్రేజీ బ్యూటీని రిపీట్ చేస్తున్న రాజమౌళి!
Recommended Video

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. బాహుబలి తర్వాత రాజమౌళి మరో భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ క్రేజీ చిత్ర షూటింగ్ గత ఏడాది నవంబర్ లోనే ప్రారంభం అయింది. రెండవ షెడ్యూల్ కూడా షూటింగ్ జరుగుతుండడంతో రాజమౌళి చిత్ర కాస్టింగ్, హీరోయిన్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల విషయంలో అనేక వార్తలు వస్తున్నా ఏదీ అధికారికంగా ఖరారు కావడం లేదు.

ఆ ముగ్గురి పేర్లు బలంగా
ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ కు జోడిగా నటించే హీరోయిన్ల విషయం ఎంతకీ తేలడం లేదు. బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. పరిణితి చోప్రా, అలియా భట్, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్ల పేర్లు బలంగా సినిపిస్తున్నాయి. రాంచరణ్ కు జోడిగా అలియా భట్ తో చిత్ర యానిటీ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ రాజమౌళి ఎవరిని ఎంపిక చేస్తాడో వేచి చూడాలి. ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ విషయంలో కూడా క్లారిటీ రావడం లేదు.

మూడో హీరోయిన్
ఈ చిత్రంలో కథ పరంగా మూడో హీరోయిన్ కు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. మూడో హీరోయిన్ పాత్ర చిత్రానికి అత్యంత కీలకం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పాత్ర కోసం రాజమౌళి సీనియర్ హీరోయిన్లపై కన్నేసినట్లు తెలుస్తోంది. నటనలో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న క్రేజీ హీరోయిన్ ప్రియమణితో ఆ పాత్ర కోసం చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతుందనేది లేటెస్ట్ టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వివాహం తర్వాత
ప్రియమణి తన ప్రియుడు ముస్తఫా రాజ్ ని 2017లో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ప్రియమణి సినిమాలకు దూరమై కేవలం టివి షోలకు మాత్రమే పరిమితమైంది. మరో విషయం ఏంటంటే ప్రియమణి గతంలో రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ చిత్రంలో నటించింది. నటనలో ప్రియమణి సత్తా తెలుసు కాబట్టే రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం ఆమెని సంప్రదిస్తున్నాడట.

జోరుగా సెకండ్ షెడ్యూల్
నిర్మాత డివివి దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జోరుగా సాగుతోంది. ఎన్టీఆర్ కు రాజమౌళి షూటింగ్ నుంచి కాస్త విరామం ఇచ్చాడట. రాంచరణ్ మాత్రం కొనసాగుతున్నాడు. తమిళనటుడు సముద్రఖని ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం ఎంపికయ్యాడు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











