డేటిచ్చేసారు...రాజమౌళి పబ్లిసిటీనే ఆలస్యం

By Srikanya

హైదరాబాద్ : తనకు నచ్చిన లేదా తను మెచ్చిన చిత్రాలను ట్విట్టర్, ఫేస్ బుక్ లేదా మీడియా ద్వారా ప్రమోట్ చెయ్యటం రాజమౌళికి అలవాటు. 1 నేనొక్కిడినే వంటి భారీ చిత్రాలకు టీవి ఛానెల్స్ కు వచ్చి మరీ ప్రమోట్ చేసిన రాజమౌళి ఇప్పుడు మరో చిత్రం ప్రమోట్ చెయ్యటానికి సిద్దమవుతున్నారా...అవుననే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. ఆ సినిమా మరేదో కాదు 'దిక్కులు చూడకు రామయ్య' . ఈ చిత్రానికి రాజమౌళి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

రాజమౌళి మరో శిష్యుడు త్రికోఠి దర్శకుడుగా తన ప్రతిభను నిరూపించుకోవటానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. నెగిటివ్ పాత్రలు పోషించే అజయ్ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దాంతో ఇక రాజమౌళి త్వరలో ఈ చిత్రం పబ్లిసిటీని ఓ రేంజిలో చేస్తాడని అంటున్నారు. వారాహి చలన చిత్రం సంస్థ తెరకెక్కిస్తోంది. రజని కొర్రపాటి నిర్మాత.

అజయ్‌, శౌర్య, ఇంద్రజ, సనాఖాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం 'దిక్కులు చూడకు రామయ్య'. నిర్మాత మాట్లాడుతూ... ''వినోదాత్మక ప్రేమకథ ఇది. త్రికోఠి చెప్పిన కథ కొత్తగా ఉంది. మా సంస్థ నుంచి వచ్చిన హిట్‌ చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా నిలుస్తుంది'' అన్నారు.

Rajamouli' assosiate move Dikkulu Choodaku…releases on

అజయ్ ఆ ఒక్కడే చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. తర్వాత సారాయి వీర్రాజు చిత్రంతో మరోసారి హీరోగా పలకరిస్తే అదీ వర్కవుట్ కాలేదు. అయితే ఈ చిత్రం ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

రాజమౌళి మొదటి నుంచీ అజయ్ ని నటుడుగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం ప్రారంభమవ్వటానికి కూడా రాజమౌళి అండదండలే కారణమంటున్నారు. ఈ చిత్రంలో అజయ్ పాత్ర చాలా డిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. అతను సరసన ముగ్గురు హీరోయిన్స్ చేస్తున్నారు.

ఈగ చిత్రంతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా, అందాల రాక్షసి చిత్రంతో ఉత్తమాభిరుచిగల నిర్మాతగా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న సాయి కొర్రపాటి ఈ చిత్రం నిర్మాత కావటంతో ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఇదే బ్యానర్ నుంచి విడుదలైన బాలకృష్ణ లెజండ్ చిత్రం ఘన విజయం సాధించిన నేపధ్యంలో ఈ చిత్రం ప్రారంభించారు. ఈ చిత్రంలోనూ అన్ని కమర్షియల్ విలువలూ ఉన్నాయని చెప్తున్నారు.

నాగినీడు, అలీ, విశాల్‌, రమేష్‌, హరితేజ, వేణు తదితరులు నటిస్తున్నారు. అజయ్‌, శౌర్య, ఇంద్రజ, సనాఖాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాటలు: రమేష్‌ - గోపి, కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: బి.వి.అమరనాథ్‌రెడ్డి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రవీందర్‌, సంగీతం: కీరవాణి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X