»   » ‘బాహుబలి’ సెకండ్ పార్ట్ స్టోరీ లీకైందా?

‘బాహుబలి’ సెకండ్ పార్ట్ స్టోరీ లీకైందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బాహుబలి' చిత్రం రెండు పార్టులుగా చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సెకండ్ పార్ట్ స్టోరీ లీకైందనే న్యూస్ ఇపుడు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. ఆ వార్తల ప్రకారం... రాజమాత(రమ్య కృష్ణ) శతృవుల బారి నుండి తన బిడ్డను కాపాడి నదిలో వదిలేస్తుందని, ఆ చిన్నారి పెరిగి శివుడు(ప్రభాస్)అవుతాడని, తర్వాత శివుడు శత్రవులపై రివేంజ్ తీర్చుకుని తన రాజ్యాన్నీ గెలుచుకుంటాడట.

ఇదేదో పాత సినిమా స్టోరీలాగా ఉంది కదూ. ఇందులో నిజమెంతో తెలియదుకానీ....ఇలాంటి వార్తలు 'బాహుబలి' సినిమాకు మరింత పబ్లిసిటీ పెంచుతున్నాయి. బాహుబలి చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇంకా రమ్యకృష్ణ, సత్యరాజ్, నాసర్, అడవి శేష్, సందీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి మొదటి పార్ట్ 2015లో థియేటర్లోకి వస్తుందని అంటున్నారు.

Rajamouli' Baahubali part-2 story leaked?

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీలో పాటు విదేశీ బాషల్లో కూడా విడుదల చేస్తారట. రెండు పార్ట్స్ కాబట్టి పెట్టిన పెట్టబడి గ్యారంటీగా తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకైతే రాజమౌళి అంచనాలు తప్పలేదు. ఏది చేసినా ముందు దాని గురించి క్షుణ్ణంగా స్టడీచేసి పర్‌ఫెక్టుగా చేయడం ఆయన స్టైల్. మరి రాజమౌళి ప్రయత్నం సక్సెస్ అయి తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని ఆశిద్దాం.

English summary
Rajamouli' Baahubali part-2 story leaked. The film's star studded cast of Prabhas,Rana,Anushka,Tamanna and its planned release in two parts is capturing the imagination of all.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu