బాలకృష్ణ ని డైరక్ట్ చేయమని ఒత్తిడి
హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా బాలకృష్ణ వందవ చిత్రానికి రాజమౌళి డైరక్టర్ అంటూ మీడియాలో,సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజమౌళి ఈ ప్రపోజల్ కి ఒప్పుకున్నాడని,బాహుబలి పూర్తవగానే ఈ ప్రాజెక్టులోకి వస్తాడని చెప్పుకుంటున్నారు. అలాగే లెజండ్ నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమాని నిర్మించనున్నారని చెప్తున్నారు. సాయి కొర్రపాటికి,రాజమౌళికి ఉన్న అనుభంధంతో ఈ ప్రాజెక్టుని ఓకే చేసాడని అంటున్నారు. లేకపోతే బాలకృష్ణ స్వయంగా రాజమౌళిని కలిసి అడుగుతాడు, అప్పుడైనా ఆయన డైరక్ట్ చేస్తాడంటున్నారు.
పార్టీ ప్రచారంలో బిజీగా బాలకృష్ణ జూన్ 1 నుంచి మళ్లీ తన రెగ్యులర్ యాక్టివిటీస్ లోకి రానున్నారు. ఆ రోజు నుంచి తన కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కొత్త దర్శకుడు సత్యదేవా డైరక్షన్ లో ఓ చిత్రం చేయబోతున్నారు. ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మించబోతున్నారు. ఈ చిత్రం మే 9 న గ్రాండ్ గా లాంచ్ కానుంది. జూన్ 1 నుంచి షూటింగ్ షెడ్యూల్ ఖరారు చేసారు. ఆ రోజు నుంచి ఆయన ముఖానికి మేకప్ వేసుకుని విజృంభించనున్నారు.

గతంలో మణిశర్మ,బాలకృష్ణ కాంబినేషన్ లో నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి, లక్ష్మీ నరసింహా వంటి చిత్రాలు వచ్చి మ్యూజికల్ గానూ విజయవంతమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ తో ఈ చిత్రం రెడీ అవుతోందని సమాచారం. ''బాలకృష్ణ శైలికి తగ్గ కథ ఇది. కుటుంబ అనుబంధాలతోపాటు అభిమానుల్ని అలరించే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ భారీ వ్యయంతో రూపొందించబోతున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియజేస్తాము''అని నిర్మాతలు తెలిపారు.


Click it and Unblock the Notifications











