ప్రభాస్ కోసమే రాజమౌళి పకడ్బందీగా వ్యూహం పన్నాడా...?
'మగధీర" తర్వాత తాను తీయబోయే సినిమాపై వచ్చే హైప్, ఎక్స్ పెక్టేషన్స్ తగ్గించడానికి రాజమౌళి తెలివైన ఎత్తేవేశాడు. సునీల్ ని హీరోగా పెట్టి 'మర్యాద రామన్న" తీసి 'మగధీర" హేంగోవర్ లోనుంచి ప్రేక్షకులు బయటకి వచ్చేలా, పూర్తిగా కొత్త మైండ్ సెట్ తో సినిమా చూసేలా చేశాడు. హిట్టు కొట్టాడు. అక్కడితో ఆగిపోకుండా 'ఈగ" అనే ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తూ 'మగధీర"ని పూర్తిగా ప్రేక్షకుల మదిలోంచి చెరిపేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ తో తీయబోయే సినిమాని 'మగధీర" తో మాత్రం పోల్చి చూడకుండా పకడ్బందీగా వ్యూహం పన్నాడు.
అయితే ఈ ప్రొసెస్ లో బడ్జెట్ లో తీద్దామని అనుకున్న 'ఈగ" కాస్తా ఇప్పుడు హై బడ్జెట్ సినిమాగా షేప్ తీసుకుందని రాజమౌళి అంగీకరించాడు. కొన్ని విషయాల్లో క్రియేటివిటీని అదుపులో పెట్టుకోలేమని, ఖర్చు పెట్టకుండా అనుకున్నదంతా తెరకెక్కించలేమని, అందుకే 'ఈగ" బడ్జెట్ చాలా పెరిగిందని రాజమౌళి చెప్పాడు. నాని సమంతలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కేవలం రాజమౌళి బ్రాండ్ నేమ్ మాత్రమే రిలీజ్ కి ముందు, తర్వాత కూడా పని చేయనుంది. ఓ రకంగా ఇది రాజమౌళికి సిసలైన పరీక్ష. డైరెక్టర్ గా అతని పూర్తి బిజినెస్ స్టామినా ఏంటనేది ఈగతో తెలుస్తుంది..అలాంటి సినిమాకి ఎక్కువ బడ్జెట్ పెట్టిస్తున్నాడంటేనే రాజమౌళికి తనపై తనకున్న నమ్మకం ఏమిటనేది అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications











