రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్.. రాజమౌళి కోసం సపరేటుగా ఇల్లు!
రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ చిత్రం దక్షిణాదిలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతోంది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. బ్రిటిష్ కాలం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందని లీకులు కూడా వస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయాడని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ నగర శివారు లోని అల్యునిమియం ఫ్యాక్టరీలో బ్రిటిష్ కాలానికి సంబందించిన సెట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సెట్ వర్క్ పనులని రాజమౌళి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన తోపాటు చిత్ర యూనిట్ సెట్ కు వచ్చి మళ్ళీ ఇంటికి తిరిగి వేలాళ్లంటే ఇబ్బందిగా మారడంతో అక్కడే ఓ టెంపరరీ ఇంటిని నిర్మించుకునే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది.
చిత్ర యూనిట్ తో పాటు, తన ఫ్యామిలీ కూడా అక్కడే ఉండేలా అన్ని సదుపాయాలతో ఓ ఇంటిని నిర్మించుకునే ఆలోచన చేస్తున్నారట. సాధారణంగా సినిమా విషయంలో లీనమైపోయే రాజమౌళి.. 300 కోట్ల బడ్జెట్ చిత్రం అంటే ఆ మాత్రం కేర్ తీసుకుంటాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications











