టార్గెట్ కేజేఎఫ్ 2.. మాస్టర్ ప్లాన్ రెడీ చేసిన జక్కన్న.. పరువు నిలుపుకునే ప్రయత్నంతో ముందుకు?

దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాని చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కేజిఎఫ్ 2 ని ఎలా అయినా బీట్ చేయాలనే విషయం మీద ఆయన మరో మాస్టర్ ప్లాన్ తో ముందుకు వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే కేజిఎఫ్ 2 విషయంలో రాజమౌళి ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్నారు? అసలు ఏమిటా వ్యవహారం? అనే వివరాల్లోకి వెళితే

కొత్త ప్లాన్

కొత్త ప్లాన్

బాహుబలి లాంటి ప్రెస్టేజియస్ మూవీ చేసి దానిని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులనే కాక అనేక భాషల ప్రేక్షకులకు చేరువ చేసిన రాజమౌళి ఆ సినిమా తర్వాత ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. నందమూరి అందగాడు ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ ఇద్దరితో కలిసి ఆయన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నాడు.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.

 మరే టీజర్ వల్ల కాలేదు

మరే టీజర్ వల్ల కాలేదు

ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా దానికి బీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ కానీ టీజర్లు గాని మంచి స్పందన తెచ్చుకోవడమే కాక రికార్డులను బద్దలు కొట్టే పరిస్థితి నెలకొంది. అయితే ఈ సినిమాకి కూడా షాక్ ఇచ్చే విధంగా కేజిఎఫ్ 2 సినిమా మాత్రం ఒక రికార్డు ను తన ఖాతాలో వేసుకుంది. 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన టీచర్లలో కేజిఎఫ్ 2 టీజర్ మొదటి స్థానాన్ని సంపాదించింది. 24 గంటల్లో 68.89 మిలియన్ వ్యూస్ సాధించిన కేజిఎఫ్ 2 టీజర్ రికార్డులు బద్దలు కొట్టడం మరే టీజర్ వల్ల కాలేదు.

దగ్గరగా రాధేశ్యామ్

దగ్గరగా రాధేశ్యామ్

అయితే ఇటీవల ప్రభాస్ హీరోగా రూపొందిన రాధేశ్యామ్ సినిమా నుంచి విడుదలైన టీజర్ దగ్గర దగ్గరగా కేజిఎఫ్ 2 టీజర్ వరకు వెళ్లడానికి ప్రయత్నించింది. దానికి కారణం రాధేశ్యామ్ సినిమా అనేక భాషలలో విడుదల అవుతున్నా ఒక్కొ భాషకు ఒక్కో టీజర్ విడుదల చేయకుండా అన్ని భాషలకు సంబంధించి ఒకే టీచర్ ఇంగ్లీష్ లో విడుదల చేసి మిగతా భాషలకు సంబంధించిన సబ్ టైటిల్స్ ఇచ్చారు. దీంతో అన్ని భాషల ప్రేక్షకులు ఓకే వీడియో చూసిన నేపథ్యంలో ఆ వీడియోకి మంచి వ్యూస్ లభించాయి.

భారీ ఎత్తున

భారీ ఎత్తున

ఇప్పుడు ఇదే ఫార్ములాను జక్కన్న కూడా ఫాలో అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ భారీ ఎత్తున ప్లాన్ చేయాలని చూస్తున్న జక్కన్న ఈ శుక్రవారం నాడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. కేవలం ఇండియన్ లాంగ్వేజస్ లోనే విడుదలవుతున్న రాధేశ్యామ్ టీజర్ కే అంత రెస్పాన్స్ వచ్చింది అంటే ఆర్ ఆర్ ఆర్ సినిమా 5 భారతీయ భాషలతో పాటు మరో ఐదు విదేశీ భాషల్లో సైతం విడుదలవుతోంది.

Recommended Video

KGF Chapter 2 Vs RRR : Rajamouli రంగంలోకి దిగితే Yash రికార్డ్ గల్లంతే!! || Filmibeat Telugu
మరెవరూ బద్దలు కొట్టలేని విధంగా

మరెవరూ బద్దలు కొట్టలేని విధంగా

ఈ నేపథ్యంలో కేజిఎఫ్ 2 సినిమా రికా ర్డులను బద్దలు కొట్టడం ఏమాత్రం కష్టం కాదని ఈ సినిమాతో ఇంకెవరు బద్దలుకొట్టి లేని విధంగా జక్కన్న రికార్డులు సృష్టించడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. శుక్రవారం నాడు ప్రమోషన్స్ మొదలుపెడితే జనవరి ఏడో తారీఖు వరకు ప్రతి వారం ఏదో ఒక అప్డేట్ సినిమా నుంచి వచ్చే విధంగా జక్కన్న ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అయితే మరి ఏ మేరకు వర్కవుట్ అవుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X