తనపేరుకో బ్రాండ్ వేల్యూ వుందంటూ లిమిట్స్ దాటుతున్న రాజమౌళి..!
డైరెక్టర్ రాజమౌళి ఎంత ఘనుడనేదానికి ఇప్పుడు ప్రత్యేకంగా ఉపోద్ఘాతాలు అక్కర్లేదు. తెలుగు సినిమా చిరత్రనే తిరగరాసిన ఘనత అతని సొంతం. అయితే వరుసగా భారీ విజయాలు అందించిన రాజమౌళి ఇప్పుడు ప్రయోగాల బాట పట్టాడు. తన స్థాయికి కమెడియన్ సునీల్ తో సినిమా తీయడం చాలా పెద్ద ప్రయోగమే అయినా అది చేసి సినిమా సక్సెస్ చేశాడు. ఇప్పుడు ఏకంగా ఈగని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాడు. అయితే ఎవరితో సినిమా తీసినా కానీ తక్కువ బడ్జెట్ లో తీయడం మాత్రం రాజమౌళి నేర్చుకోట్లేదు.
తన సినిమా క్వాలిటీ తగ్గకూడదని, తన పేరుకో బ్రాండ్ వేల్యూ ఉన్నదని చెబుతూ 'ఈగ" సినిమాపై కూడా దాదాపు పాతిక కోట్లు పెట్టుబడి పెట్టిస్తున్నాడని అంటున్నారు. మర్యాద రామన్నకి కూడా అవసరానికి మించి ఎక్కువ ఖర్చు పెట్టడంతో అరకొర లాభాలతో ఆ సినిమా బయటపడింది. ఈసారి ఈగ ప్రయోగం తిరగబడితే నిర్మాత తక్కువ నష్టాలతో బయటపడే ఆస్కారం కనిపించడం లేదు. అందుకే ఈ సినిమాతో కూడా రాజమౌళి తప్పక హిట్టు కొట్టి తీరాలి. దర్శకుడిగా అతనికి బ్రాండ్ వేల్యూ ఉన్న మాట నిజమే కానీ ప్లాప్ సినిమాతో పాతిక కోట్లు తెచ్చేంత ఘనుడైతే ఖచ్చితంగా కాదు.


Click it and Unblock the Notifications











