RRR: ఆ హీరో అభిమానులకు రాజమౌళి షాక్.. ముఖ్యమైన సీన్ కట్.. అసలెందుకు తీసేశారంటే!
ఒకవైపు దేశమే మెచ్చిన దర్శకుడు.. మరోవైపు ఇండస్ట్రీనే ఏలుతున్న ఇద్దరు స్టార్ హీరోలు.. ఇంకోవైపు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడని నిర్మాత ఇలా క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన తర్వాత రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇందులో మెగా నందమూరి ఫ్యామిలీల హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ మూవీ స్థాయి మరింతగా పెరిగిపోయింది. భారీ అంచనాలతో మరికొద్ది రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా RRR మూవీ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం!

రియల్ హీరోలుగా మారిన స్టార్లు
తెలుగు గడ్డపై పోరాడిన విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి తెరకెక్కించిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో తారక్.. కొమరం భీం, చరణ్.. అల్లూరి పాత్రలను చేశారు.

రికార్డ్స్ బ్రేక్... భారీ అంచనాలు
మొదటి నుంచే RRR మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది వచ్చినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. మరీ ముఖ్యంగా ఆ మధ్య వచ్చిన ట్రైలర్‌కు దేశ వ్యాప్తంగా స్పందన దక్కింది. ఇందులో హీరోల ఎలివేషన్స్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. దీంతో రికార్డులు సైతం బ్రేక్ అయ్యాయి.

అత్యధిక బిజినెస్... 12 భాషల్లో
భారతీయ చలన చిత్ర రంగంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీకి అత్యధిక స్థాయిలో బిజినెస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా హక్కులకు భారీ ధరలు వచ్చాయి. దీంతో టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియాలోనే రికార్డు నమోదైంది. ఇక, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ, హిందీ సహా మొత్తం 12 భాషల్లో విడుదల చేయబోతున్నారు.

సెన్సార్ పూర్తి.. రన్ టైం ఇలా
RRR మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అదే సమయంలో ఇటీవలే ఈ సినిమా సెన్సార్స్‌ను కూడా జరుపుకుంది. దీనికి UA సర్టిఫికెట్ జారీ అయింది. ఇక, ఈ సినిమా మొత్తం 3 గంటల 6 నిమిషాల 54 సెకెన్ల నిడివితో రాబోతుందని వెల్లడించారు.

సినిమాలో ఆ హీరో సీన్ కటింగ్
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీ నుంచి ఎన్నో రకాల వార్తలు ముందే లీక్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎంతో ముఖ్యమైన ఒక సీన్‌ను కట్ చేశారని తెలిసింది. ఎన్టీఆర్‌తో తీసిన ఈ సన్నివేశం సినిమాలో ముఖ్యమైనదే అయినా అనివార్య కారణాల వల్ల తీసేయాల్సి వచ్చిందని ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

ఆ సీన్ ఎందుకు తీసేశారంటే
RRR మూవీలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి తీసిన ఈ సన్నివేశం 1.36 నిమిషాలు అంటే 96 సెకెన్ల నిడివితో ఉంటుందట. అయితే, ఇప్పటికే సినిమా రన్ టైమ్ మూడు గంటలకు పైగా రావడంతో దాన్ని తీసేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. ముందుగా ఈ విషయాన్ని ఎన్టీఆర్‌కు చెప్పిన రాజమౌళి.. అతడు పర్మీషన్ ఇచ్చిన తర్వాతనే కట్ చేశాడనే టాక్ వినిపిస్తోంది.

ఈ సీన్ మళ్లీ యాడ్ చేస్తారట
RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సన్నివేశాన్ని తీసేయడానికి రాజమౌళికి సైతం మనసు ఒప్పలేదని అంటున్నారు. అందుకే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. ఆ తర్వాత దీన్ని సినిమాలో కలపాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఆ సీన్ ఏంటా అని అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











