బిగ్ స్టార్‌కు షాకిచ్చిన రాజమౌళి: RRRలో ఆ సీన్స్ అన్నీ కట్.. ఈ నిర్ణయంతో ఆయనకు నష్టం.. ఆమెకు కష్టం!
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. రెండు దశాబ్దాలుగా సినీ కెరీర్‌ను సాగిస్తోన్న ఆయన.. తీసిన అన్ని చిత్రాలనూ విజయవంతం చేసుకున్నాడు. తద్వారా వంద శాతం సక్సెస్ రేటు ఉన్న దర్శకుడిగా రికార్డులకెక్కాడు. అదే సమయంలో కొన్ని ఇండస్ట్రీ హిట్‌లను అందుకుని.. వాటి ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం RRR అనే మూవీ చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా విషయంలో రాజమౌళి సంచలన నిర్ణయం తీసుకున్నాడట. ఆ వివరాలు మీకోసం!
అందాన్ని అలా కప్పేసిన శిల్పాశెట్టి.. అయినా కోవిడ్ రూల్స్ బ్రేక్..

నిజమైన హీరోల కథతో.. భారీ మల్టీస్టారర్‌గా
జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, హీరోయిన్లు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. భీంగానూ నటిస్తున్నారు. వీళ్లతో పాటు అజయ్ దేవగణ్, శ్రీయ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

సుదీర్ఘ ప్రయాణం.. అసలైంది ఇప్పుడు స్టార్ట్
రాజమౌళి సినిమా అంటే రెండు మూడేళ్లు షూటింగ్ జరుపుకోవాల్సిందేనన్న నానుడి ఉంది. అందుకు అనుగుణంగానే RRR రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై రెండేళ్లకు పైగానే పూర్తయింది. అయితే, అనివార్య కారణాల వల్ల పలు ఆటంకాలు ఎదురవడంతో ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తీ కాలేదు. ఇక, ఇటీవలే క్లైమాక్స్ సీన్ చిత్రీకరణను ప్రారంభించారు. ప్రస్తుతం ఇదే షూట్ అవుతోంది.
హల్లో చార్లీ ట్రైలర్ లాంచ్ వేడుక.. సినీ తారల కళకళ

ఇద్దరూ ఇద్దరే.. కనీవినీ ఎరుగని రికార్డులతో
RRR మూవీపై అన్ని ఇండస్ట్రీలూ బాగా ఫోకస్ చేశాయి. దీనికి కారణం ఇది భారీ హంగులతో రూపొందుతోండడమే. అందుకే ఈ సినిమా నుంచి ఏది వచ్చినా సంచలనం అవుతోంది. మొదటిగా రిలీజ్ అయిన టైటిల్ మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ 'భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీం' వీడియోలు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేశాయి.

రెండు సార్లు నిరాశ.. దానిపై ఇప్పటికీ డౌట్లు
నిజానికి RRRను జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, అనుకున్న తేదీకి చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో జనవరి 8, 2021న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పుడు కూడా అదే పరిస్థితి వల్ల అక్టోబర్ 13, 2021న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అయితే, ఈ తేదీ కూడా మారుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ముదురు వయసులో వన్నె తరగని కరీనా కపూర్.. ట్రోలింగ్ గురైన లేటెస్ట్ పిక్స్ ఇవే

ఈ సినిమాలో భాగమైన మరో ఇద్దరు స్టార్లు
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న RRRలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. అల్లూరి, కొమరం భీంకు అతడు గురువుగా కనిపించనున్నాడని అంటున్నారు. ఇక, అతడికి జోడీగా ఒకప్పటి స్టార్ హీరో శ్రీయ నటిస్తోంది. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన పార్టును కూడా పూర్తి చేసుకుంది. అజయ్ భాగం కూడా కంప్లీట్ అయిపోయింది.

స్టార్ హీరోయిన్‌కు బిగ్ షాకిచ్చిన రాజమౌళి
RRR విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో ఇప్పటి వరకూ పూర్తయిన భాగం మీద ఎడిటింగ్ వర్క్ ప్రారంభం అయినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో అజయ్ దేవగణ్ భార్యగా నటించిన శ్రీయ పార్టును తొలగించాలని ఆయన డిసైడ్ అయినట్లు తెలిసింది. ఆమెతో చేసిన సీన్స్ అన్నీ కట్ చేయబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Recommended Video

ఈ నిర్ణయంతో ఆయనకు నష్టం.. ఆమెకు కష్టం
సినిమా నిడివి ఎక్కువగా అవుతోన్న నేపథ్యంలో కొన్ని సీన్స్ కట్ చేస్తున్నారని, ఇందులో భాగంగానే శ్రీయ పార్టును కూడా తీసేస్తున్నారని తెలుస్తోంది. రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నిర్మాత దానయ్యకు కొంత మేర నష్టం జరిగే అవకాశం ఉంది. ఆమెకు రెమ్యూనరేషన్ ఇచ్చిన మొత్తాన్ని వృథా చేసుకున్నట్లైంది. అలాగే, హీరోయిన్ శ్రీయకు కూడా షాక్ తగిలినట్లు అవుతుంది.


Click it and Unblock the Notifications











