ఇక లాభంలేదని.. ఎన్టీఆర్ విషయంలో రాజమౌళి ఇలా ఫిక్సయ్యాడా..?

Recommended Video

SS Rajamouli Decision On NTR & RRR Movie Goes Viral || Filmibeat Telugu

ఒకప్పటిలా లేదు లోకం.. టెక్నాలజీ బాగా విస్తరించడంతో ఏ క్షణానికి ఆ క్షణం తాజా అప్ డేట్స్ కోరుకుంటున్నారు జనం. అందునా సోషల్ మీడియా బాగా విస్తృతమవడంతో ఓ చిన్న విషయమైనా ఇట్టే వైరల్ అవుతోంది. ఇక సినిమా సంగతులంటారా? వాటికి కొదవే లేదు. నెట్టింట ఎక్కడ చూసిన సినిమా ముచ్చట్లే. ఈ నేపథ్యంలో రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్ గురించి మరో ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. ఆ విశేషాలు చూద్దామా..

 భారీ మల్టీస్టారర్

భారీ మల్టీస్టారర్

బాహుబలి లాంటి అపూర్వ విజయం తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో హై రేంజ్ టెక్నీకల్ వాల్యూస్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా మొదలు కాగానే నటీనటులకు సంబంధించిన అన్ని విషయాలు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు జక్కన్న.

ఇంతలో అనుకోని పరిణామం

ఇంతలో అనుకోని పరిణామం

ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన బ్రిటిష్ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ నటించాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో రాజమౌళి మరో హీరోయిన్ కోసం వేట ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పలువురు అందాల తారల పేర్లు పరిశీలిస్తున్నారు.

ఆ హీరోయిన్స్ డిమాండ్ భారీగా ఉండటంతో

ఆ హీరోయిన్స్ డిమాండ్ భారీగా ఉండటంతో

ఎన్టీఆర్‌కు హీరోయిన్ ఎంపిక చేయడం రాజమౌళికి పెద్ద సమస్యలా తయారైంది. భారీ సినిమా, పెద్ద హీరో కావడంతో రాజమౌళి సెలెక్ట్ చేసే హీరోయిన్ ఎవరా అనే ఆసక్తి నెలకొంది జనాల్లో. అయితే డైసీ ప్లేస్ లో ముందుగా పరిణీతి చోప్రా , జాక్వెలిన్ ఫెర్నాండేజ్, శ్రద్దా కపూర్ లాంటి హీరోయిన్స్ ని సంప్రదించినప్పటికీ వారు రెమ్మ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేయడంతో జక్కన్న వెనక్కి తగ్గారని తెలిసింది.

ఇక లాభంలేదని భావించి..

ఇక లాభంలేదని భావించి..

ఈ లోగా ఎన్టీఆర్ సరసన నిత్యామీనన్ సెలెక్ట్ కానుందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ తాజాగా వైరల్ అవుతున్న వార్తలను బట్టి రాజమౌళి తిరిగి ఫారెన్ బ్యూటీలనే ఓటు వేస్తున్నాడని తెలుస్తోంది. ఇక లాభం లేదు చూస్తుంటే లేట్ అవుతోందని భావించిన జక్కన్న.. ఇప్పటికే కొందరు ఫారెన్ నటీమణులతో ఆడిషన్స్ కూడా పూర్తి చేశారనేది తాజా సమాచారం. చూడాలి మరి ఎన్టీఆర్ హీరోయిన్ ఇంకెప్పుడు కన్ఫర్మ్ అవుతుందో!

ఆర్ఆర్ఆర్ గురించి

ఆర్ఆర్ఆర్ గురించి

1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో ఆర్ఆర్ఆర్ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో దర్శనమీయనున్నారు. డీవీవీ దానయ్య సమర్పణలో హై రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై నెలలో విడుదల కానుంది.

More from Filmibeat

Read more about: rrr ram charan rajamouli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X