రాజమౌళికి టెప్టింగ్ ఆఫర్స్ తో డిస్టర్బ్ చేస్తున్న స్టార్స్..!?
దక్షిణాది దర్శకులకి మాస్ పల్స్ బాగా తెలుసని బాలీవుడ్ స్టార్ హీరోలు గట్టిగా నమ్ముతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఆడియన్స్ కూడా రొమాంటిక్ కామెడీలతో విసిగిపోయి మాస్ మసాలాలకే పట్టం కడుతూ ఉండడంతో అక్కడి హీరోలకి మన దర్శకులపై మరింత గురి పెరిగింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఎక్కువ మంది కేవలం ఎన్నారై రొమాన్సులు మాత్రమే తీస్తారని ముద్ర పడిపోవడంతో సహజంగానే వారి దృష్టి సౌత్ డైరెక్టర్స్ పై పడింది.
మురుగదాస్, ప్రభుదేవా అక్కడ ప్రూవ్ చేసుకోవడంతో సౌతిండియాలో మాస్ పల్స్ అద్భుతంగా తెలిసిన రాజమౌళిపై ఎక్కువ మంది బాలీవుడ్ స్టార్స్ దృష్టి పెడుతున్నారు. ఇటీవలే అమీర్ ఖాన్ స్వయంగా రాజమౌళి ఇంటికి పిలిచి చిన్న పాటి విందించ్చిన సంగతి తెలిసిందే. అలాగే రాజమౌళి ఊ అంటే మగధీరని హిందీలో చేసేయడానికి చాలా మంది హీరోలు రెడీగా ఉన్నారు. ఎలాగైనా రాజమైళి బాలీవుడ్ తోలుకుపోవాలని కొందరు పెద్ద పెద్ద వలలు సైతం సిద్దం చేసుకుంటున్నారు. అయితే తన మైండ్ కి తోచినట్టుగా వివిధ రకాల సినిమాలు చేస్తున్న రాజమౌళి ప్రస్తుతానికి బాలీవుడ్ పై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయితే రోజుకో టెంప్టింగ్ ఆఫర్ అతడిని డిస్టర్బ్ చేస్తోంది. కనుక త్వరలోనే మనసు మార్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.


Click it and Unblock the Notifications











