రాజమౌళి దర్శకత్వంలో మహేష్ కన్ఫర్మ్
మహేష్ బాబు తాజాగా మరో చిత్రం కమిటయ్యారు. హాట్ షాట్ డైరక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత కొద్దిరోజులుగా రాజమౌళి, మహేష్ ల మధ్య జరుగుతున్న డిస్కషన్స్ కు నిన్న శుభం కార్డు వేసారు. అయితే ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ కావటానికి కొంత సమయం పట్టనుందని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి..హాస్య నటుడు సునీల్ తో మర్యాద రామన్న చిత్రం చేస్తున్నారు. అనంతరం ప్రభాస్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నారు. ఆ తర్వాత మహేష్ తో చేసే చిత్రం ఉంటుంది. అలాగే మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న చిత్రం పూర్తి కాగానే శ్రీను వైట్ల చిత్రం చేస్తారు. అనంతరం సురేంద్రరెడ్డి దర్శకత్వంలో మిస్టర్ ఫెరఫెక్ట్ పూర్తి చేయాలి. వీటిన్నటి తర్వాత లింగు స్వామితో చేసే చిత్రం ఉంటుంది. అంటే మహేష్, రాజమౌళి కాంబినేషన్ ప్రారంభం కావటానికి ఓ ఆరు నెలలు పైనే పట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











