నాగచైతన్యతో సరే అన్న రాజమౌళి

By Srikanya

రాజమౌళి దర్శకత్వంలో చిత్రం అంటే హీరోలంతా ఉత్సాహం చూపిస్తారు. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో నాగచైతన్యకు ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. నాగార్జునతో ఈ మేరకు రాజమౌళి ప్రామిస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జునతో రాజన్న చిత్రం యాక్షన్ ఎపిసోడ్స్ డైరక్టర్ గా వర్క్ చేసిన రాజమౌళి ఈ మేరకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రభాస్ చిత్రం అనంతరం ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి ఈగ చిత్రం బిజీగా ఉన్నారు.ఆ చిత్రం పూర్తవగానే ప్రభాస్ చిత్రం ప్రారంభమవుతుంది.

రాజన్న విషయానికి వస్తే... రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం చారిత్రక నేపధ్యంలో జరుగుతుంది. నాగార్జున సెకెండాఫ్ లో కనిపించే ఓ కీలకమైన పాత్ర చేస్తున్నారు. స్నేహ, నాగార్జున సరసన ఈ చిత్రంలో చేస్తోంది. నాగార్జున కనపించే ఎపిసోడ్స్ మొత్తం విజయేంద్రప్రసాద్ కుమారుడు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరక్ట్ చేసారు. యాక్షన్ డైరక్టర్ గా టైటిల్ కార్డులో రాజమౌళి పేరు పడుతుంది.

తెలంగాణ నేఫద్యంలో పీరియాడిక్ గా ఈ ఎపిసోడ్ ఉంటుందని యాక్షన్ ప్రధానంగా రూపొందుతుందని సమాచారం. రజాకార్ల ఉద్యమం నేపద్యంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న సమరయోధుడి కధతో 'రాజన్న' తెరకెక్కింది. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ చిత్రం కథ జరిగే కాలం..1945-55. ఇక ఈ చిత్రంలో నాగార్జున పూర్తి తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X