రాజమౌళి మీదే మొత్తం భారం వేసేసి కూల్ గా నాగార్జున
నాగార్జున, విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రాజన్న అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓకే చేయటానికి కారణం రాజమౌళి ఈ చిత్రంలో వచ్చే యాక్షన్ పార్ట్ ని డైరక్ట్ చేస్తానని కమిటవటం. యాక్షన్ పార్ట్ మినహా మిగతా సినిమా మొత్తం విజయేంద్ర ప్రసాద్ డైరక్ట్ చేస్దారని అనుకుని దిగారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. తన ఇంట్రడక్షన్ సీన్ నుంచి తన ఎండింగ్ దాకా తను వచ్చే ఎపిసోడ్ మొత్తం రాజమౌళి డైరక్ట్ చేయాలని నాగార్జున పట్టుపట్టారుట. దాంతో తప్పనిసరి పరిస్ధితుల్లో రాజమౌళి భారం మొత్తం తనపై వేసుకుని నాగార్జున వచ్చే ఎపిసోడ్ మొత్తం చెక్కడం మొదలెట్టాడట. అంతేగాక సినిమాలో అదో స్పెషల్ గా కనపడకుండా మిగతా సినిమాని కూడా పర్యవేక్షిస్తూ తన తండ్రికి సలహాలు ఇస్తూ, సహాయం చేస్తూ తెరకెక్కిస్తున్నాడని వినికిడి. ఇక ప్రస్తుతం రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టు ఈగ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











