మహేష్ తరువాత మళ్ళీ అదే హీరోతో రాజమౌళి న్యూ మూవీ.. డ్రీమ్ ప్రాజెక్ట్?

దర్శకధీరుడు రాజమౌళి చాలా రోజుల తరువాత తన నెక్స్ట్ ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడు. అసలైతే ఒక సినిమా ఫినిష్ అయితే గాని మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురాని జక్కన్న బహుబలి అనంతరం RRRని మొదలుపెట్టగానే మరొక సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఇక మహేష్ తరువాత ఎవరితో వర్క్ చేయనున్నాడు అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

RRR ట్రబుల్..

RRR ట్రబుల్..

లాక్ డౌన్ కారణంగా సినిమా పనులు మొత్తంగా ఆగిపోవడంతో రాజమౌళి టీమ్ టెన్షన్ లో పడింది. సినిమా షూటింగ్ దాదాపు ఎండ్ అవుతున్న సమయంలో ఊహించని విధంగా ఆగిపోవడం తీరని నష్టమనే చెప్పాలి. ఇక సమయం కూడా చాలా వృధా అయ్యింది. అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేస్తారా చేయరా.. అనే సందేహం కలుగుతోంది.

వాయిదా పడితే..?

వాయిదా పడితే..?

RRR సినిమాను మొదట ఈ సమ్మర్ ఎండింగ్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కావాలని వచ్చే ఏడాది సంక్రాంతికి షిఫ్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు లాక్ డౌన్ దెబ్బకు ప్రీ ప్రొడక్షన్ పనులకు సమయం సరిపోదేమో అనిపిస్తోంది. ఒకవేళ వాయిదా వేయాలని అనుకుంటే 2021 సమ్మర్ కి సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

 మహేష్ తరువాత ఎవరితో?

మహేష్ తరువాత ఎవరితో?

దర్శకధీరుడు రాజమౌళి RRR సినిమా అనంతరం మహేష్ బాబుతో వర్క్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత ఎవరితో వర్క్ చేస్తారనే విషయం కూడా ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మహేష్ బాబుతో సినిమా పూర్తి చేయడానికి మినిమామ్ ఏడాదిన్నర సమయం పద్దవచ్చు. ఇక 2022లోనే రాజమౌళి మరో సినిమాపై ఫుల్ డీటెయిల్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

Recommended Video

Mahesh Babu, Ram Charan To Team Up With New Project After RRR | Filmibeat Telugu
డ్రీమ్ ప్రాజెక్ట్..

డ్రీమ్ ప్రాజెక్ట్..

మహేష్ బాబు సినిమా తరువాత రాజమౌళి ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో మహాభారతం కథను తెరకెక్కించాలనేది తన కోరిక అని చెబుతున్న జక్కన్న ఆ సినిమాను ఎన్టీఆర్ తోనే డిజైన్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా హీరోలను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ మెయిన్ గా ఎన్టీఆర్ తోనే ఎక్కువ పాత్రలు చేయించే ఛాన్స్ ఉందట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే.. రాజమౌళి చెప్పేవారకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X