రజనీకాంత్-రాజమౌళి రూ. 120 కోట్ల ప్రాజెక్ట్?
హైదరాబాద్: టాలీవుడ్ నెం.1 డైరెక్టర్ రాజమౌళి 'ఈగ' చిత్రంతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ఎలాంటి చిత్రాన్నయినా తాను హ్యాండిల్ చేయగలనని నిరూపించుకున్నాడు. ఈ చిత్రం అనంతరం రాజమౌళి ప్రభాస్ తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు. సరికొత్త కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.
ప్రభాస్ చిత్రం తర్వాత దర్శకుడు రాజమౌళి అత్యంత భారీ ప్రాజెక్టుకు ప్లాన్ చేసుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఈ మేరకు సూపర్ స్టార్ రజనీకాంత్ కు సరిపోయే స్టోరీ ఒకటి తయారు చేసే పనిలో ఉన్నాడట. దాదాపు రూ. 120 కోట్ల అంచనాతో ఆ సినిమాకు సంబంధించి ప్రణాళిక వేసుకుంటున్నాడట జక్కన్న.
రజనీకాంత్ కు చిన్నప్పటి నుంచి అభిమాని అయిన రాజమౌళి....ఈగ చిత్రం ద్వారా స్వయంగా రజనీతో మెప్పు పొందారు. ఇదే అదునుగా రజనీ ఆశ్యర్యానికి గురయ్యే స్టోరీ, స్క్రిప్టుతో ఆయన్ను కలిసేందుకు రెడీ అవుతున్నాడని, రజనీ ఓకే చెబితే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు మార్గం సుగమం అయినట్లే అని అంటున్నారు.
రజనీతో సినిమా చేయడం ద్వారా రాజమౌళి ఆలిండియా టాప్ డైరెక్టర్ శంకర్ ను బీట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో? ఏం జరుగబోతోందో వెయిట్ అండ్ సీ...


Click it and Unblock the Notifications











