రాజమౌళి తండ్రిపై నిషేధం!
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ పై తెలుగు సినిమా పరిశ్రమ నిషేదం విధించిందనే వార్తలు ఫిల్మ్ నగర్ లో గుప్పుమన్నాయి. నమ్మశక్యంగా లేక పోయినా ఇది నిజం. దీంతో విజయేంద్ర ప్రసాద్ ఏం తప్పు చేశాడు? అనే దానిపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం....ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ పై బ్యాన్ విధించినట్లు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కౌన్సిల్ నుంచి మెంబర్స్ అందరికీ ఎస్ఎంఎస్ లు అందాయి. ఫిల్మ్ ఛాంబర్ నిబంధనల ప్రకారం 'నాన్ కోఆపరేషన్ యాక్టు" కింద ఆయనపై నిషేదం విధించినట్లు తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్ అసహజ వ్యవహారశైలే ఇందుకు కారణమని చర్చించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకుని పరిశ్రమలోని ప్రముఖులంతా షాకయ్యారు. అసలు విషయం ఏమిటో తెలుసుకోవడానికి విజయేంద్ర ప్రసాద్ ను ఫోన్ లో సంప్రదించాలని ప్రయత్నించినా....అందుబాటులోకి రావడం లేదట. విజయేంద్రప్రసాద్ ప్రస్తుతం నాగార్జున హీరోగా రూపొందుతున్న రాజన్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత నుంచి అతనిపై నిషేదం కొనసాగే అవకాశం ఉంది.
విజయేంద్ర ప్రసాద్ ఆ మధ్య డబ్బు వ్యవహారంలో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. మాజీ ఎమ్మెల్యే, నిర్మాత చెంగల వెంకట్రావ్ తనను డబ్బు కోసం బెదిరించారని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కూడా. మరి దానికి...తాజాగా విధించిన నిషేదానికి ఏమైనా సంబంధం ఉందా...? ఈ నిషేదం విధించడం వెనక అసలు కారణం ఏమిటి..? అసలు ఈ వార్తల్లో నిజం ఎంత? అనేది తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











