రాజమౌళి సినిమాకు సీక్వెల్ రెడీ చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్
రవితేజ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'విక్రమార్కుడు'. 2006లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో రవితేజ సరసన అనుష్క నటించింది. ఈ సినిమానే హిందీలో 'రౌడీ రాథోడ్' పేరిట రీమేక్ చేశారు. అక్షయ్ కుమార్ హీరోగా 2012లో వచ్చిన ఈ సినిమాను ప్రభుదేవా తెరకెక్కించాడు. కామెడీకితోడు, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అక్కడ కూడా బంపర్ హిట్ సాధించింది.
ఇందులో అక్షయ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే ప్రభుదేవా డైరెక్షన్ కూడా మెప్పించింది. అయితే, రాజమౌళి 'విక్రమార్కుడు'తోనే ఆపేయగా, బాలీవుడ్‌లో మాత్రం ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వార్త కొద్దిరోజులుగా బీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే, తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. త్వరలోనే 'రౌడీ రాథోడ్-2' పట్టాలెక్కబోతుందనేదే ఆ వార్త సారాంశం.

బాలీవుడ్‌లోనే బడా దర్శకుల్లో ఒకరైన సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. ఆయన సొంత బ్యానర్ అయిన ఎస్‌ఎల్‌బీ ఫిల్మ్స్ ద్వారా సంజయ్ ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో రూపొందించబోతున్నారని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన కథను కూడా ఆయన సిద్ధం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ స్క్రీప్టును అక్షయ్‌కు కూడా వినిపించారని, దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది.
2018లోనే అక్షయ్‌తో సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు సంజయ్ లీలా భన్సాలీ. అందుకు అనుగుణంగానే ఆయన 'రౌడీ రాథోడ్-2' కథను సిద్ధం చేశారని తెలిసింది. ఈ సినిమా మొదటి భాగమైన 'రౌడీ రాథోడ్' సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు రూ. 130 కోట్లు పైగా వసూళ్లు సాధించింది. దీంతో రెండో భాగాన్ని అత్యంత జాగ్రత్తగా తెరకెక్కించాలని సంజయ్ భావిస్తున్నట్లు, అందుకు అనుగుణంగానే కథను రెడీ చేసినట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











