అనూష్క ప్రధాన పాత్రలో రాజమౌళి చిత్రం
అనుష్క ప్రధాన పాత్రలో ఓ చిత్రం రూపొందించడానికి రాజమౌళి సిద్ధమవుతు న్నాడని ఫిల్మ్ నగర్ టాక్.ఈ మేరకు రాజమౌళి ఓ స్టోరీ లైన్ ని ఆమెకు చెప్పాడని, ఈ ప్రపోజల్ పట్ల అనుష్క కూడా పాజిటివ్‌గా స్పందించి వెంటనే ఓకే చెప్పుకుంటున్నారు.యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలా దాన్ని తీర్చి దిద్దాలని రాజమౌళి తలపోస్తున్నాట్ట.అప్పట్లో వచ్చిన విజయశాంతి తరహా చిత్రం అయ్యే అవకాశముందని చెప్పుకుంటున్నారు.ఇందుకోసం స్క్రిప్ట్ పని జరుగుతోందని వినపడుతోంది.ఇక రాజమౌళి ప్రస్తుతం నాని,సమంత కాంబినేషన్ లో ఈగ చిత్రం రూపొందిస్తున్నారు.గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందే ఈ చిత్రాన్ని సురేష్ బాబు సమర్పిస్తున్నారు.
ఇక తన సినిమాలోని కథాంశం ఏమిటో ఓపెనింగ్ రోజునే ఓపెన్ గా రాజమౌళి చెప్పేసారు.'ఈగ" సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ" రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ"గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ"ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ" అన్నదే క్లుప్తంగా 'ఈగ" కథాంశం.


Click it and Unblock the Notifications











