హీరో స్టామినా చూసి సినమా తియ్యను: రాజమౌళి
దర్శకధీర రాజమౌళి తను చేసే చిత్రాలు తన కోసమే తప్ప వేరే వారి కోసం కాదని అంటున్నాడు. ఈ మద్య నా ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తా! మీకు ఇష్టం అయితే చూడండి లేదంటే లేదన్న రామ్ గోపాల్ వర్మ వైఖరినే జక్కన్న అనుకరిస్తున్నట్టు ఉందికదూ..! దర్శకుడిగా నేను సంతోషపడే వరకు చిత్రాన్ని తీసుకెళతాను తప్ప ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూస్తారో?లేదో? అని ఎప్పుడు ఆలోచించను. ఏహీరోతో చిత్రం చేసినా ఆ హీరో స్టామినా ఏంటి? అభిమానులు ఒప్పుకుంటారా! అని అస్సలు ఆలోచించిను. (అందుకు నిదర్శనం మొన్న మర్యాద రామన్న, ఇప్పుడు ఈగే కాబోలు..)నన్ను నమ్మిన నిర్మాతలు, బయ్యర్లు సేఫ్ గా ఉండాలని మాత్రమే మైండ్ లో ఫిక్స్ చేసుకుంటా అంటున్నాడు రాజమౌళి.
పైకి అలా చెబుతున్నా ఇదంతా పబ్లిసిటీ కోసమే అనే విషయం అందరికీ తెలిసిపోతూనే ఉందంటారు విమర్శకులు. ఇంకా చెప్పాలంటే వర్మను మించిపోయేలా ఉన్నాయ్ రాజమౌళి మాటలు..మరి నీ ఇష్టం వచ్చినట్లు, నీ మనసుకు నచ్చినట్టు సినిమా తీస్తానంటే ఫరవాలేదు కానీ ప్రేక్షకుల కోసం కాదంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది. అది రాజమౌళి తెలుసుకోవాలని అంటున్నారు విమర్శకులు.


Click it and Unblock the Notifications











