RRR Update: రాజమౌళిపై కొత్త భారం!.. ఫ్యాన్స్ మధ్య గొడవలు రావద్దని..
ఫ్యాన్స్ మధ్య గొడవలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణంగా ఒకేసారి ఇద్దరి హీరోల సినిమాలు రిలీజ్ అయితే సినిమా థియేటర్స్ వద్ద బందోబస్తు ఉండాల్సిందే. ఇక ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించబోతున్నారు అంటే ఆ అంచనాల డోస్ ని తట్టుకోవడం దర్శకుడికి సాధ్యం కాదు. అందుకే మల్టీస్టారర్ సినిమాలు చేయడం చాలా రిస్క్ అంటుంటారు.
అయితే రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR ప్రాజెక్ట్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు నటిస్తుండడంతో అభిమానుల మధ్య వాతావరణం ఎలా ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. చిత్ర యూనిట్ ఆ విషయంలో నమ్మకంతో ఉన్నప్పటికీ సినిమా వచ్చే వరకు ఎలా ఉంటారో చెప్పలేము.
సినిమా కథ అనుకున్నపుడే రాజమౌళి కాస్త కంగారు పడ్డారట. ఇక సీన్స్ రాసుకుంటున్నపుడు కొంత భయానికి లోనయ్యారట. అభిమానులను కొన్ని సీన్స్ విషయంలో సంతృప్తి పరచడం చాలా కష్టమని అనుకున్నారట.

కానీ తెరపైకి అనుకున్నది అనుకున్నట్లుగా సీన్స్ ని తీసుకువెలితే తప్పకుండా ఇరు వర్గాల అభిమానులను సంతృప్తి పరచవచ్చని రచయిత విజయేంద్రప్రసాద్ రాజమౌళికి చెప్పారట. ఆ సీన్స్ భారాన్ని మొత్తం దర్శకుడు రాజమౌళి మొదట తండ్రిపైనే వేశాడట.
ముందు తను రాసుకున్న సీన్స్ ని పక్కనపెట్టి తన తండ్రి చెప్పిన ఐడియాలు ఫాలో అవుతున్నారట. మొత్తంగా అభిమానుల్లో ఎక్కడా కూడా తమ హీరో అవతలి హీరో కంటే తక్కువగా కనిపిస్తున్నాడు అనే ఆలోచన రాకుండా.. సమానంగా కథను సెట్ చేసుకున్నారట. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











