ఖాలీగా ఉండటమెందుకుని రాజమౌళి ఘోస్ట్ డైరక్షన్

By Srikanya

రాజమౌళి తన తండ్రి దర్శకత్వం వహిస్తున్న రాజన్న చిత్రానికి ఘోస్ట్ డైరక్షన్ చేస్తున్నాడంటూ అంతటా వినపడుతోంది. మర్యాద రామన్న చిత్రం తర్వాత ఏ ప్రాజెక్టూ మొబలైజ్ చేయని రాజమౌళి ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తండ్రి రచయిత విజయేంద్రప్రసాద్ నాగార్జున హీరోగా రాజన్న అనే చిత్రం ఓకే చేయించుకున్నారు. అన్నపూర్ణ బ్యానర్ పై నిర్మితమయ్యే ఈ చిత్రం కమిటవ్వటానికి నాగార్జున ఒక కండిషన్ పెట్టారు. అది యాక్షన్ ఎపిసోడ్స్ ని రాజమౌళి చిత్రీకరించాలని. అలాగే అని ఓకే చేసిన రాజమౌళి ప్రస్తుతం టెక్నికల్ గా తన తండ్రి చిత్రాన్ని పర్యవేక్షిస్తున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రం చారిత్రక నేపధ్యంలో జరుగుతుంది. నాగార్జున సెకెండాఫ్ లో కనిపించే ఓ కీలకమైన పాత్ర చేస్తున్నారు. తెలంగాణ నేఫద్యంలో పీరియాడిక్ గా ఈ ఎపిసోడ్ ఉంటుంది. కథ రజాకార్ల ఉద్యమం(1945-55) నేఫద్యంలో జరగుతుంది. నాగార్జున సరసన స్నేహ హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రంలో నాగార్జున పూర్తి తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X