twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR తరువాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ సినిమాలపై డిజాస్టర్ సెంటిమెంట్.. ఈసారి బ్రేక్ చేస్తారా?

    |

    ఒక సినిమా హిట్టయితే ఆ తరువాత వచ్చే సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక రాజమౌళితో సినిమా చేసిన తరువాత హీరోల మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇక ఆ తరువాత వచ్చే సినిమాతో కూడా అంచనాలను అందుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఇక ఇప్పటివరకు దర్శకధీరుడితో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ తరువాత సినిమాతో అపజయాలు ఎదుర్కొన్నారు. దీంతో RRR హీరోల తరువాత సినిమాలపై కూడా ఆ బ్యాడ్ సెంటిమెంట్ మీమ్స్ వస్తున్నాయి.

    తెలుగు హీరోలను అస్సలు వధలడం లేదు

    తెలుగు హీరోలను అస్సలు వధలడం లేదు

    దర్శకధీరుడు రాజమౌళితో వర్క్ చేయడానికి స్టార్ హీరోలు చిన్న హీరోలు అందరూ రెడీగా ఉంటారు. ఆయన రేంజ్ పాన్ ఇండియా స్థాయికి వచ్చినా కూడా తెలుగు హీరోలను అస్సలు వధలడం లేదు. ప్రతిసారి తెలుగు మార్కెట్ స్థాయి పెంచేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. కానీ రాజమౌళితో సినిమా చేసిన తరువాత ఏ హీరో కూడా మళ్ళీ ఆ రేంజ్ కు తగ్గట్లుగా సక్సెస్ చూడడం లేదు.

    జూనియర్ ఎన్టీఆర్ తో మూడు..

    జూనియర్ ఎన్టీఆర్ తో మూడు..

    అందరికంటే ఎక్కువగా రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ తోనే మూడు సినిమాలో చేశారు. అయితే స్టూడెంట్ నెంబర్ వన్ అనంతరం తారక్ సుబ్బు చేశాడు. సింహాద్రి తరువాత ఆంధ్రవాలాతో వచ్చాడు. ఇక యమదొంగ అనంతరం కంత్రి విడుదలవ్వగా మూడు సార్లు హిట్స్ తరువాత డిజాస్టర్ ను చూడాల్సి వచ్చింది.

    ప్రభాస్ పరిస్థితి కూడా అంతే..

    ప్రభాస్ పరిస్థితి కూడా అంతే..

    ఇక ప్రభాస్ ఛత్రపతి అనంతరం పౌర్ణమితో డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. బాహుబలి రెండు బాగలతో పాన్ ఇండియా మార్కెట్ ను పెంచుకున్న డార్లింగ్ అనంతరం సాహోతో ఆ మార్క్ ను అందుకోలేకపోయాడు. నితిన్ సై సినిమా అనంతరం అల్లరి బుల్లోడు ప్లాప్ అయిన విషయం తెలిసిందే.

    సునీల్, నాని, రవితేజ కూడా

    సునీల్, నాని, రవితేజ కూడా

    ఇక రవితేజ కెరీర్ ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచిన విక్రమార్కుడు అనంతరం ఖాతార్నాక్ తో డిజాస్టర్ రాగా మగధీర అనంతరం రామ్ చరణ్ కూడా ఆరెంజ్ తో ప్లాప్ అందుకున్నాడు. హీరోగా కెరీర్ సెట్ చేసుకోవాలని అనుకున్న సునీల్ కు మర్యాదరామన్న భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఆ తరువాత వచ్చిన కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం అప్పల్రాజు ఫెయిల్యూర్ గా నిలిచింది.

    నాని ఈగ సినిమా తరువాత ఎటో వెళ్లిపోయింది మనసుతో వచ్చి అదే తరహాలో ప్లాప్ ను అందుకున్నాడు.

    Recommended Video

    Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
    శంకర్ - కొరటాల శివ బ్రేక్ చేస్తారా?

    శంకర్ - కొరటాల శివ బ్రేక్ చేస్తారా?

    ఇలా దాదాపు అందరు హీరోలు కూడా రాజమౌళి ఇచ్చిన బూస్ట్ ను మరుసటి సినిమాతో అయితే నిలబెట్టుకోలేకపోయారు. దీంతో అదొక బ్యాడ్ సెంటిమెంట్ గా వస్తోంది. RRR తరువాత రామ్ చరణ్ - శంకర్ సినిమాతో రాబోతుండగా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాను లైన్ లో పెట్టాడు. ఈ రెండు సినిమాల దర్శకులు కూడా మంచి సోషల్ మెస్సేజ్ ఇచ్చేవారే. మరి రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ను వారు బ్రేక్ చేస్తారో లేదో చూడాలి.

    English summary
    Star Heroes are all ready to work with director Rajamouli. Even though he has reached the level of Range Pan India, he is not leaving Telugu heroes at all. He plans to increase the level of the Telugu market every time. But after doing it with Rajamouli no hero is looking to succeed to fit that range again.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X