RRR: రన్‌ టైమ్‌పై రాజమౌళి సంచలన నిర్ణయం.. ఆ సీన్స్ కూడా యాడ్ చేసి.. అన్ని నిమిషాలు ఎక్కువగా!

తెలుగు సినీ చరిత్రలోనే తనదైన దర్శకత్వ శైలితో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని.. దర్శకధీరుడిగా పేరొందాడు ఎస్ఎస్ రాజమౌళి. ఆరంభంలో తెలుగుకు మాత్రమే పరిమితమైన ఈ టాప్ డైరెక్టర్.. బాహుబలితో పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిపోయాడు. ఈ చిత్రంతో టాలీవుడ్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనతను అందుకున్నాడు.

ఇంతటి సక్సెస్‌ఫుల్ సిరీస్ తర్వాత జక్కన్న ఇప్పుడు RRR (రౌద్రం రణం రుధిరం) మూవీని తెరకెక్కించాడు. భారీ అంచనాలతో బిగ్ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రన్ టైమ్ గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

రియల్ హీరోల కథతో వస్తోంది

రియల్ హీరోల కథతో వస్తోంది

తెలుగు రాష్ట్రాలకు చెందిన పోరాట వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి తెరకెక్కించిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలను పోషించారు.

 రికార్డులతో అంచనాలు కూడా

రికార్డులతో అంచనాలు కూడా

ప్రకటన సమయం నుంచే RRR మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది వచ్చినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. మరీ ముఖ్యంగా ఆ మధ్య వచ్చిన ట్రైలర్‌కు దేశ వ్యాప్తంగా స్పందన దక్కింది. అలాగే, ఈ చిత్రంలోని పాటకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు సైతం నమోదు అయిపోయాయి.

రికార్డ్ బిజినెస్.. గ్రాండ్ రిలీజ్

రికార్డ్ బిజినెస్.. గ్రాండ్ రిలీజ్

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీకి అత్యధిక స్థాయిలో బిజినెస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా హక్కులకు భారీ ధరలు వచ్చాయి. దీంతో టాలీవుడ్‌లోనే కాకుండా ఇండియాలోనే రికార్డు నమోదైంది. ఇక, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ, హిందీ సహా మొత్తం 12 భాషల్లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

Recommended Video

RRR Road Show: NTR, Ram Charan And Rajamouli Visits Statue of Unity | Filmibeat Telugu
సెన్సార్ కంప్లీట్... రన్‌ టైమ్

సెన్సార్ కంప్లీట్... రన్‌ టైమ్

RRR మూవీ మార్చి 25న విడుదల కాబోతుంది. దీంతో యూనిట్ మొత్తం ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అదే సమయంలో ఇటీవలే ఈ సినిమా సెన్సార్స్‌ను కూడా జరుపుకుంది. దీనికి UA సర్టిఫికెట్ జారీ అయింది. ఇక, ఈ సినిమా మొత్తం 3 గంటల 6 నిమిషాల 54 సెకెన్ల నిడివితో రాబోతుంది.

తెలుగులో కట్స్... ఆ భాషల్లో

తెలుగులో కట్స్... ఆ భాషల్లో

భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీ నుంచి ఎన్నో రకాల వార్తలు ముందే లీక్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో తీసిన ఈఎంతో ముఖ్యమైన ఒక సీన్‌ను కట్ చేశారని తెలిసింది. ఇలా సినిమా నిడివిని రెండు నిమిషాల పాటు తగ్గించారనే ప్రచారం జరుగుతోంది. అయితే, మిగిలిన భాషల్లో మాత్రం తెలుగు వెర్షన్‌ మాదిరిగానే ఉంచారని అంటున్నారు.

రన్‌ టైమ్‌పై జక్కన్న యూటర్న్

రన్‌ టైమ్‌పై జక్కన్న యూటర్న్

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) రన్ టైమ్‌పై తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా మొత్తం 3 గంటల 6 నిమిషాల 54 సెకెన్ల నిడివితో రాబోతుందని ముందే చెప్పుకున్నాం. అయితే, హిందీలో మాత్రం మరో ఐదు నిమిషాలు ఎక్కువ రన్ టైమ్‌తో వస్తుందట. అంటే అక్కడ దాదాపు 3 గంటల 10 నిమిషాలు ఉంటుందట.

వాళ్లిద్దరి కోసమే పెంచారంటూ

వాళ్లిద్దరి కోసమే పెంచారంటూ

RRR (రౌద్రం రణం రుధిరం) మూవీకి సంబంధించి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకలా.. హిందీ వెర్షన్‌కు మాత్రమే మరోలా రన్ టైమ్‌ను నిర్ధారించడానికి కారణం ఏంటనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. అజయ్ దేవగణ్, ఆలియా భట్ పాత్రల కోసం హిందీలో రన్ టైమ్ పెంచారని ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X