మెగా గాలానికి రాజమౌళి పడతాడా..?
హీరోల కొడుకులు, దర్శకలు కొడుకులు, నిర్మాతల కొడుకులు..సీనీ పరిశ్రమలో ఏ శాఖలో వున్నప్పటికీ వారి వారి కుమారులు హీరోలుగా రంగంలోకి దిగుతున్నారు. అలా మెగా ఫ్యామిలిలో క్యూలో వున్నవారు రామ్ చరణ్, అల్లు అర్జున్, ధర్మ తేజ్ మరియు వరుణ్ తేజ్. ప్రస్తుతం నిర్మాత నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్నాడన్న విషయం తెలిసిందే. అయితే అతన్ని ఆషామాషి సినిమా ద్వారా హీరోగా తీసుకురాకూడదని, ఓ భారీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నాగబాబు అనుకుంటున్నాడు. అతని దృష్టంతా టాప్ డైరెక్టర్ రాజమౌళి మీదే వుంది. అతని డైరెక్షన్ లో వరుణ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తే అతని కెరీర్ కి ఢోకా ఉండదని నాగబాబు అభిప్రాయం.
అయితే ఇంతవరకు రాజమౌళి ఏ హీరోని ఇంట్రడ్యూస్ చేసే సాహసం చెయ్యలేదు, ఇకపై చెయ్యకపోవచ్చు కూడా. కానీ నాగబాబు మాత్రం విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఓ పక్క అన్నయ్య కొడుకు రామ్ చరణ్ హీరోగా మంచి రేంజ్ కి వెళ్లాడు. మరో పక్క మామ అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ కూడా టాప్ పొజిషన్ లో వున్నాడు. వారిలాగే తన కొడుకుని కూడా మంచి హీరోని చెయ్యాలని నాగబాబు తహ తహలాడుతున్నాడు. మరి ఈ విషయంలో రాజమౌళి ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











