అతన్ని పట్టించుకోని రాజమౌళి, జూ ఎన్టీఆర్..!?
టీవీ సీరియల్స్ లో అద్భుతంగా నటించేస్తూ ఉంటే, ఇతను టీవీ సీరియల్ మెటీరియల్ కాదని, సినిమాల్లో ఉండాలని రాజీవ్ కనకాలని తీసుకొచ్చి తన సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ ఇచ్చి రాజమౌళి ఎంకరేజ్ చేశాడు. జూ ఎన్టీఆర్ కి మంచి స్నేహితుడు అయిన రాజీవ్ కి అతని సినిమాల్లోను మంచి క్యారెక్టర్లు పడేవి. తర్వాత ఒకటి రెండు సినిమాల్లో హీరోగానూ ఎదిగిన రాజీవ్ కనకాల ఇప్పుడు బొత్తిగా కనిపించడం లేదు. రాజమౌళి, జూ ఎన్టీఆర్ సినిమాల్లోనూ అతని జాడ కనిపించడం లేదు.
చక్కని నటుడైనా కానీ రాజీవ్ ని పరిశ్రమ ఎందుకు పట్టించుకోవడం లేదంటే అందుకు కారణం అతని స్వయంకృతమే అనాలి. పచ్చి తాగుబోతు అయిన రాజీవ్ కనకాల షూటింగ్ కి కూడా తాగేసి వస్తుంటే నిర్మాతలు అతడిని తట్టుకోలేకపోయారు. ఒకరి నుంచి ఒకరికి అతని దురలవాటు సంగతి పాకిపోయి ఇప్పుడు ఎవరూ అవకాశాలివ్వడం లేదు. ఎంకరేజ్ చేసిన రాజమౌళి, జూ ఎన్టీఆర్ లు కూడా అతడిని ఇప్పుడు అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంతగా పతనమైనా కానీ ఇప్పటికీ రాజీవ్ మందు మానలేకపోతున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











