పబ్లిక్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్: రాజమౌళి...!
టాలీవుడ్ లో పబ్లిక్ పల్స్ తెలిసిన ఏకైక దర్శకుడు ఎవరంటే...?అది రాజమౌళినే అని అర్థమౌతుంది. అందుకే అతని జీవితంలో ఫైయిల్యూర్స్ చూడకుండా సక్సెస్ బాటలోనే నడుస్తున్నాడు. అభిమానుల అంచనాల్ని, హీరోల ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని తాను సినిమాలు తీయనని రాజమౌళి పేర్కొన్నారు. 'నేను నా కోసం సినిమాలు తీసుకుంటా! జనం కోసం కాదు" అని రాజమౌళి నొక్కి చెప్తున్నారు. ఏ సినిమా తీసేటప్పుడైనా తాను తన సినిమాపై పెట్టుబడి పెట్టిన నిర్మాతలు, బయ్యర్ల డబ్బు తిరిగొస్తుందా లేదా అని టెన్షన్ పడతానని, అభిమానులు ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో అని అస్సలు ఆలోచించనని చెప్తున్నారు.
దర్శకుడిగా వైవిధ్యమైన అనుభూతి కోసమే వేరే వేరే జోనర్స్ ని ట్ చేస్తుంటానని, దానికీ హీరోలకీ సంబంధం లేదని అతను తేల్చేశారు. తన కోసం సినిమాలు తీసుకుంటన్నా కానీ జనం మెచ్చే చిత్రాలు, అభిమానుల అంచనాలు సైతం అందుకునే సినిమాలు చేయడమే రాజమౌళి స్పెషాలిటీ. నాకోసమే తీసుకుంటా, చూస్తే చూడండి అనే ధోరణి రామ్ గోపాల్ వర్మలోనూ ఉంది...కానీ అతనికి రాజమౌళికి తెలిసినంతగా పబ్లిక్ పల్స్ తెలీదు.
ఇక ఈగ సినిమా విషయానికి వస్తే ఇది తాను చేస్తున్న అతి పెద్ద ప్రయోగమనే చెప్పాలి, ఇంతకు మించి ప్రయోగాన్ని తననుంచి ఆశించవద్దని రాజమౌళి ట్విస్ట్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











