అక్కినేని అఖిల్ ఎంట్రీకి రంగం సిద్దం,దర్శకుడెవరంటే...
ఇప్పటికే రాజమౌళి కుమారుడు కార్తీక్... అఖిల్ తో ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. మాటీవీ షార్ట్ ఫిలింస్ కంటెస్ట్ లో ఆ షార్ట్ ఫిలిం ప్రదర్శిస్తారని చెప్పుకుంటున్నారు. ఇక బాహుబలి అనంతరం ఈ చిత్రం ప్రారంభమవుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే ఈ విషయాన్ని రాజమౌళి ఖరారు చేయలేదు.
నాగచైతన్య ఎంట్రీ విషయంలో నాగార్జున అంచనాలు తారుమారయ్యాయి. చైతన్య తొలి చిత్రం'జోష్' అపజయాన్ని మూటగట్టుకుంది. ఈనేపథ్యంలో అఖిల్ విషయంలో అలా జరుగకూడదని నాగార్జున భావిస్తున్నారు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆమోదించదగ్గ సబ్జెక్టు, స్క్రీన్ ప్లేను రాజమౌళి తో రెడీ చేయిస్తున్నాడని టాక్.
ప్రస్తుతం రాజమౌళి...బాహుబలి బిజీలో ఉన్నారు. బాహుబలి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో దగ్గుపాటి రానా ఓ కీ రోల్ ని చేస్తున్నారు. అనుష్క హీరోయిన్ గా చేస్తోంది. త్వరలోనే ఈ చిత్రం షూట్ కి వెళ్తోంది.


Click it and Unblock the Notifications












