మహేశ్ 27వ మూవీ రాజమౌళితో కాదు.. అయోమయానికి గురి చేస్తున్న షాకింగ్ న్యూస్.!

By Manoj

సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినీ రంగంలోకి ప్రవేశించినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని స్టార్ హీరోగా ఎదిగాడు మహేశ్ బాబు. హ్యాండ్సమ్ లుక్‌తో పాటు నటనను కనబరచగల సామర్ధ్యం ఉండడంతో అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపించే అతడు.. కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే త్వరలో రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు. దర్శకధీరుడి నోటి వెంట ఈ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

హ్యాట్రిక్‌తో పాటు ఇండస్ట్రీ హిట్టూ కొట్టాడు

హ్యాట్రిక్‌తో పాటు ఇండస్ట్రీ హిట్టూ కొట్టాడు

కొన్నేళ్లుగా మహేశ్ బాబు హవా చూపిస్తున్నాడు. గతంలో ‘భరత్ అనే నేను', ‘మహర్షి' వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు'తో మరో విజయాన్ని అందుకున్నాడు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీతో మహేశ్ హ్యాట్రిక్‌తో పాటు ఇండస్ట్రీ హిట్టునూ కొట్టాడు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

హిట్ డైరెక్టర్‌కు హ్యాండ్ ఇచ్చిన మహేశ్

హిట్ డైరెక్టర్‌కు హ్యాండ్ ఇచ్చిన మహేశ్

‘సరిలేరు నీకెవ్వరు' తర్వాత మహేశ్ బాబు.. వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది. అంతేకాదు, ఇందులో మహేశ్ బాబు గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడని, ఇది పక్కా మాస్ మూవీ అని ప్రచారం జరిగింది. కానీ, ఈ సినిమా పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. అయితే, దీనికి గల కారణాలు మాత్రం తెలియలేదు.

వంద కోట్ల దర్శకుడికి పచ్చజెండా ఊపాడు

వంద కోట్ల దర్శకుడికి పచ్చజెండా ఊపాడు

వంశీ పైడిపల్లిది ఆగిపోయిన తర్వాత మహేశ్ బాబు తన 26 చిత్రానికి.. ‘గీత గోవిందం'తో వంద కోట్ల మార్క్ అందుకున్న పరశురాంకు పచ్చజెండా ఊపాడు. ఈ సినిమా మే 31న అధికారికంగా ప్రారంభం కాబోతుందని ప్రచారం జరుగుతోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమా వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.

రాజమౌళితో మహేశ్ బాబు సినిమా

రాజమౌళితో మహేశ్ బాబు సినిమా


పరశురాంతో సినిమా అయిపోయిన వెంటనే మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఇటీవల ఓ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో RRR తర్వాత మహేశ్ బాబుతో మూవీ చేస్తున్నట్లు జక్కన్న ప్రకటించడమే. అప్పటి నుంచి ఈ మూవీ గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి.

మహేశ్ 27వ మూవీ రాజమౌళితో కాదు

మహేశ్ 27వ మూవీ రాజమౌళితో కాదు


మహేశ్ - రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. మహేశ్ నటించే 27వ మూవీ రాజమౌళిది కాదట. ఆయనతో సినిమాకు ముందు సూపర్ స్టార్ హరో డైరెక్టర్‌తో పని చేయనున్నాడని అంటున్నారు. ఆ దర్శకుడు ఎవరన్నది మాత్రం తెలియరాలేదు.

Recommended Video

#Betherealman: Why Mahesh Babu, Pawan Kalyan, Prabhas Are Not In Challenge ?
అయోమయానికి గురి చేస్తున్నన్యూస్

అయోమయానికి గురి చేస్తున్నన్యూస్

వాస్తవానికి పరశురాంతో సినిమా అవడానికి ఓ ఏడాది సమయం పట్టొచ్చు. అప్పటికి రాజమౌళి RRR కూడా రిలీజ్ అవుతుంది. తర్వాత వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తారు అని అంతా అనుకున్నారు. అయితే, కరోనా ప్రభావంతో RRR వాయిదా పడే అవకాశాలు ఉన్నాయట. దీనికితోడు రాజమౌళి లాంగ్ గ్యాప్ తీసుకోనున్నాడని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X